Share News

kumaram bheem asifabad-బాలికల విద్యపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:38 PM

బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ్ల కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మహిళ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-బాలికల విద్యపై దృష్టి సారించాలి
పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ్ల కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మహిళ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. బాలికలను ఎదుగనివ్వాలని చెప్పారు. చదివించాలని, అడపిల్లలు దేశానికి గర్వకారణమని అన్నారు. వారిని రక్షించుకోవడానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని తెలిపారు. బడి మానేసిన అడపిల్లలను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. తిరిగి బడికి తీసుకురావాలని సూచించారు. బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నైపుణ్య శిక్షణలో భాగంగా బ్యూటీషియన్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ కోర్సులను నిర్వహించాలని తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 ప్రకారం ప్రతీ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం బాలల రక్షణ చట్టాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యువో స్వరూపరాణి, డీడీ జాదవ్‌ అంబాజీ, డీఎంహెచ్‌వో నాగేంద్ర సిడాం, డీసీపీవో మహేష్‌, డీఈవో సచ్చిదానందచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 10:38 PM