Share News

సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:28 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ హేమం త కేశవ్‌ పాటిల్‌ ఆదేశించారు.

సదుపాయాల కల్పనపై  దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- ఆస్పత్రి హెచ్‌వోడీల సమీక్షలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ హేమం త కేశవ్‌ పాటిల్‌ ఆదేశించారు. మంగళవారం నా గర్‌కర్నూల్‌ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షా సమావేశ మందిరంలో జిల్లా ఆ సుపత్రి వైద్యులు, ప్ర భుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ వైద్య విభాగాల హెచ్‌వోడీలతో ఆయన సమీక్ష సమా వేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వైద్య విభా గాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయా లు, పరికరాలు, సిబ్బంది వివరాలపై సమీక్షిం చారు. మౌలిక సదుపాయాల కొరతను గుర్తిం చాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆసుపత్రిలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆ దేశించారు. త్వరలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సదు పాయాన్ని ప్రారంభించ నున్నట్లు కలెక్టర్‌ వెల్ల డించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ సుప్రియ, డాక్టర్‌ రఘు, వైద్యులు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ వైద్య విభాగాల హెచ్‌వోడీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:29 PM