Share News

kumaram bheem asifabad- పట్టణ పరిశుభ్రతపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:48 PM

కాగజ్‌నగర్‌ పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ హరిత తెలిపారు. గురువారం కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా, తీరందాజ్‌ టాకీస్‌ చౌరస్తాను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిచంఆరు.

kumaram bheem asifabad- పట్టణ పరిశుభ్రతపై దృష్టి సారించాలి
వార్డులో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ హరిత

కాగజ్‌నగర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ హరిత తెలిపారు. గురువారం కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా, తీరందాజ్‌ టాకీస్‌ చౌరస్తాను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిచంఆరు. ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్‌ అధికారులు ప్రతి రోజు మురుగు కాల్వలను శుభ్రం చేయాలన్నారు. అలాగే తడి, పొడి చెత్తను సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణ గురుకృప టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు నీటిని, వినియోగించిన ప్లేట్లను రోడ్డుపై పడేసినందులకు టిఫిన్‌ సెంటర్‌ యాజమానికి జరిమానా విధించాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని ఆదేశించారు. దుకాణాల యాజమానులు ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లను రోడ్డుపై పడవేయకుండా చెత్త కుండిలో వేయాలని, పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ తిరుపతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. గురువారం కాగజ్‌నగర్‌ మండలంలోని గన్నారం, మండువ, ఆరెగూడ, అనుకోడ చెరువులు, వాగులను ఆమె పరిశీలించారు. నజ్రూల్‌నగర్‌ నెం.12లో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేక పోవటంతో ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా మట్టి, ఇసుక తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి లేదా ఇసుక రవాణా చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతనే తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ తహసిల్దార్‌ మధూకర్‌, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 10:48 PM