kumaram bheem asifabad- సమస్యలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:36 PM
నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ పంచాయతీల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని డీఎల్‌పీవో హరిప్రసాద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న సమస్యలను సర్పంచ్‌లు తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రత్యేకంగా రానున్న వేసవి కాలంలో నీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు.
సిర్పూర్(టి), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ పంచాయతీల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని డీఎల్‌పీవో హరిప్రసాద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న సమస్యలను సర్పంచ్‌లు తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రత్యేకంగా రానున్న వేసవి కాలంలో నీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలు చేకూరేలా చూడాలన్నారు. తహసీల్దార్ రహీముద్దీన్ మాట్లాడుతూ మండలంలో 8,643 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వారికి ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ఏపీఎం మహేష్ మాట్లాడుతూ మండలంలోని 14 గ్రామ పంచాయతీలో ఈజీఎస్‌లో వీవో భవనాల కోసం ఒక్కో దానికి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు. గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు అయ్యాయని వివరిం చారు. త్వరలోనే సర్పంచ్‌ల తీర్మానాల ప్రకారం పనులను ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీవో వినోద్‌కుమార్, ఏఈలు, కార్యదర్శులు పాల్గొన్నారు.