పరిషత్ ఎన్నికలపై దృష్టి...
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:36 PM
గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలోనూ పరిషత్ ఎ న్నికల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
-త్వరలో నిర్వహణకు సన్నాహాలు
-కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే రిజర్వేషన్లు
-జిల్లాలో 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు
-నియోజక వర్గాల్లో పెరనున్న ఓటర్ల సంఖ్య
మంచిర్యాల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలోనూ పరిషత్ ఎ న్నికల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కోర్టు సూ చనల మేరకే కేటగరీల వారీగా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇతర ఎన్నికల నిర్వహణ పనులు కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి లో క్‌సభ ఎలక్షన్లు ముగియగానే, పరిషత్ ఎన్నికలకు మా ర్గం సుగమం అయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాఽ దించేందుకు కొంత సమయం పట్టింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పాలక వర్గాల పదవీకాలం గతేడా ది జూలై మాసంతో ముగిసింది. దీంతో సంస్థల పాల నాపరంగా ప్రత్యేకాఽధికారుల చేతుల్లోకి వెళ్లింది.
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు....
జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా, అంతే మొత్తంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. అ లాగే జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 129 ఉన్నా యి. గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ము న్సిపల్ కార్పొరేషన్‌లో మూడు స్థానాలు విలీనం అ య్యాయి. దీంతో వాటి సంఖ్య 127కు తగ్గింది. మళ్లీ కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా రెండు ఎంపీటీసీ స్థానాలను పెంచారు. దీంతో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 129కి చేరింది. పరిషత్ ఎ న్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామ గ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది.
కోర్టు సూచనలతోనే రిజర్వేషన్లలో స్పష్టత...
ఎంపీటీసీ మొదలుకొని జడ్పీ చైర్మన్ స్థానం వరకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు కోర్టు గైడ్ లైన్స్‌పైనే ఆధారపడనున్నాయి. రాష్ట్రంలో బీసీ కు లగణన సర్వే పూర్తయినందున జనాభా ప్రాతిపదిక న రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమా యత్తం అవుతుండగా, అన్ని వర్గాలకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉంది. గ త పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల క మిషన్ ఇదే నిబంధనను అమలు చేయగా, పార్టీప రంగా కాంగ్రెస్ వివిధ కేటగరీలకు రిజర్వేషన్లు అమలు చేసింది. ఇందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప రిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి అవలంభిస్తుందా...? లేదా నిబంధనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుం దా...? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ పార్టీ నిర్ణయం మేరకు మొన్నటి ఎన్నికల మాదిరిగా 42 అమలు చేస్తే బీసీలకు పెద్దపీట వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రి జర్వేషన్లు అనుకూలించిన చోట బీసీ సామాజిక వర్గాల కు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించ నుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదే ళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసేలా చట్ట సవర ణ తిరిగి చేపట్టడంతోపాటు పార్టీ పరంగా అవకాశం కల్పిస్తే ఆశావహులు పోటీ చేసేందుకు సన్నద్ధం అవు తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకా రం రిజర్వేషన్లు కేటాయించగా, సాంఘీక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన ప్రకారం బీసీ రిజర్వే ష న్లు ఖరారు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 16 జ డ్పీటీసీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకున్న పక్షంలో 42 శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. ఆ నిష్పత్తిలో 7 స్థానాలు బీసీలకు ద క్కనుండగా, 2 స్థానాలు ఎస్టీలకు, 4 స్థానాలు ఎస్సీలు, 3 స్థానాలను జనరల్ కేటగరీకి కేటాయించే అవకాశం ఉంది. అలాగే జడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు సైతం ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు ఉన్నా యి. అలాగే ఎంపీపీ స్థానాలు 16 ఉండగా, జడ్పీటీసీ మాదిరిగానే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా ప్రథమ మహిళ స్థానం అయిన జిల్లా పరిషత్ చైర్మపర్సన్ పీఠాన్ని సై తం బీసీ మహిళకే రిజర్వు అయ్యే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లోనూ మహిళలకు పెద్దపీట వేయగా, రాబోయే పరిషత్ ఎలక్షన్లలోనూ ఇది పునరావృతం అ య్యే అవకాశాలు ఉన్నాయి.
పెరగనున్న ఓటర్లు....
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగ నుంది. మొన్నటి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కటాఫ్ తేదీని 10-07-2025గా ప్రకటించారు. అప్పటి వ రకు ఓటర్‌గా నమోదు చేసుకున్న వారందరికీ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఎన్నిక లకు సమయం కలిసి వచ్చినందున కటాఫ్ తేదీని 05- 02-2026 నాటికి పరిగణలోకి తీసుకోనున్నారు. కటాఫ్ తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రికీ ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పెరిగిన ఓటర్లను జాబితాలో చేర్చే పనుల్లో ప్ర స్తుతం సిబ్బంది బిజీగా ఉన్నారు. దాదాపు ఏడు నెలల సమయం అదనంగా కలిసి రావడంతో ఓటర్ల సంఖ్య పెరగనుంది. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు సైతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు క ల్పించనున్నారు. పెరిగిన కటాఫ్ తేదీ ప్రకారం నూత నంగా 2699 మంది ఓటరు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పురుషులు 1213 మంది, స్త్రీలు 1486 మంది ఉన్నారు.