Share News

kumaram bheem asifabad- స్వీయగణనపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:00 PM

జనగణన- 2027లోభాగంగా చేపట్టే స్వీయ గణన ప్రక్రియ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి హాజరై మాట్లాడారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్లగణన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

kumaram bheem asifabad- స్వీయగణనపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, పాల్గొన్న సిబ్బంది

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జనగణన- 2027లోభాగంగా చేపట్టే స్వీయ గణన ప్రక్రియ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి హాజరై మాట్లాడారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్లగణన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. రెండో విడతలో జనగణన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన స్పష్టమైన జాబితా రుపొందించనున్నామని చెప్పారు. ఇందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ అందించనున్నామని తెలిపారు. స్వీయ గణన కార్యక్రమ నిర్వహణలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుంద న్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయగణన పోర్టల్‌ అందుబాటులో ఉంటుందని అదనపు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా స్థాయి జనగణన అధికారులు ప్రతిరోజు స్వీయ గణన వివరాలను నవీకరించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్వీయగణనపై ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు స్వీయగణన కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు జనాభ ప్రతిపాధికన చేపడుతుందని వివరించారు. జనగణన కోసం అధికారులు వచ్చిన సమయంలో ప్రజలు వాస్తవ సమాచారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక కార్యాలయ సిబ్బంది, మాస్టర్‌ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:00 PM