Share News

kumaram bheem asifabad- మౌలిక వసతులపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 10:24 PM

గ్రామాలు, వార్డులలో పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రాజంపేట గ్రామ పంచాయతీలో గురువారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

kumaram bheem asifabad- మౌలిక వసతులపై దృష్టి సారించాలి
:రాజంపేట గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామాలు, వార్డులలో పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రాజంపేట గ్రామ పంచాయతీలో గురువారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అలాగే దశ్నాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె అకాష్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. కాగా ఆయా గ్రామపంచాయతీలలో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, రాజంపేట సర్పంచ్‌ పోచయ్య, ఉప సర్పంచ్‌ మామిడి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి

- ఎమ్మెల్సీ దండె విఠల్‌

దహెగాం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. దహెగాం మండలం చిన్నరాస్పెల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్‌ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, గృహ జ్యోతి, వరి కొనుగోలుకు బోనస్‌, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, తదితర సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు చేపట్టారరు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆత్మ చైర్మన్‌ శ్రీరామరావు, సర్పంచ్‌లు రాజేశ్వరి, జయలక్ష్మి, ఎంపీఓ శ్రీనివాస్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఏఈ అంజల్‌కుమార్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో శ్రీనివాస్‌, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట,(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఆగర్‌గూడలో సర్పంచ్‌ రాజేశ్వరి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, కార్యదర్శి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిశీలించి అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులు సూచించారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మండల ప్రత్యేకాధికారి వెంకటి, ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిరాం గౌడ్‌ అన్నారు. మండలంలోని కోటారి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన. కెరమెరి, గోయగాం, కేలి(బి), సాంగ్వీ, అనార్‌పల్లి, నిశాని, ఇందాపూర్‌తో పాటు మండల వ్యాప్తంగా ఉన్న 31 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సీడీపీవో ఇందిరా, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 10:24 PM