kumaram bheem asifabad- కాంగ్రెస్ నేతల ఫోకస్
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:57 PM
సిర్పూరు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే రోజుల్లో పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయా లనే లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపడుతు న్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే రోజుల్లో పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయా లనే లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపడుతు న్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఇప్పటికే సిర్పూరు నియోజకవర్గంలో పార్టీ పట్టు పెం చుకునేందుకు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్ పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా ఆయన కీలక ప్రయత్నాలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి అదిత కూడా దృష్టి సారిస్తున్నారు.
గ్రామాల పరిధిలో..
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తు ప్రజల సమస్యలను తెలుసుకుం టున్నారు. ఇప్పటికే సిర్పూరు(టి), బెజ్జూరు, దహెగాం తదితర మండలాల్లో కూడా పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్నారు. సిర్పూరు(టి)లోని చీలపెల్లి గిరి గ్రామాలకు అభివృద్ధి పనులకు తన వంతు విరాళాన్ని కూడా అందజేశారు. అలాగే సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల సమస్యల విషయంలోనూ అండగా ఉంటూ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. అలాగే హైకోర్టులో ఎస్పీ ఎం యాజమాన్యం కేసు వేయడంతో ఎన్ని కల ప్రక్రియ బ్రేక్ కావడంతో ఈ కేసుపై కూ డా కీలక అడుగులు వేస్తున్నారు. ఈ విష యంలో కార్మిక శాఖ మంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. సిర్పూరు నియో జకవర్గంలో వివిధ కార్యక్రమాలను చేస్తు ముందుడుగు వేస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతలు కీలకంగా అడుగులు వేస్తుం డడంపై కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది.