kumaram bheem asifabad-పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:09 PM
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించి, బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు
ఆసిఫాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించి, బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయరాదని పోలీసు అధికారులంతా బాధ్యత యుతంగా వ్యవహరించాలని తెలిపారు. 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా దృష్టి సారించాలని సూచిచారు. . బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయి లాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు ఆశోక్, వహీదుద్దీన్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.