kumaram bheem asifabad- మొదలైన వరద కష్టాలు
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:08 PM
మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజ లు వాగు దాటే సమయంలో గిరిజనుల బాదలు వర్ణనాతీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి-సోమిని గ్రామాల మద్య రెండు లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది.
- లోలెవల్ వంతెనలపై బ్రిడ్జిలు లేక అవస్థలు
- వర్షాకాలంలో ప్రజలకు తప్పని తిప్పలు
- వైద్య సదుపాయాలకు నోచుకోని వైనం
- అటవీ అనుమతులే అసలు సమస్య
బెజ్జూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజ లు వాగు దాటే సమయంలో గిరిజనుల బాదలు వర్ణనాతీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి-సోమిని గ్రామాల మద్య రెండు లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది. ఆయా గ్రామాల మద్య రెండు వంతెనల నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2014లో సుశ్మీర్ సమీపంలో ఒర్రెపై వంతెన నిర్మానానికి రూ.2.15కోట్లు, కుష్న పల్లి సమీపంలో వంతెన కోసం రూ.2.10కోట్లు నిధు లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ వంతెనల నిర్మాణానికి అటవీ అనుమతులు లేవన్న కారణంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల మద్య వంతెనలు లేక దాదాపు 10 గ్రామాల గిరిజనులు అనేక అవస్థలు పడుతు న్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో ఇక తమ కష్టాలు కూడా మొదలైనట్టేనని గిరి గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఎన్ని దశాబ్దాలు అభివృద్ధికి దూరంగా గడిపేదంటూ పాలకుల తీరుపై ప్రశ్నిస్తున్నారు.
- వచ్చిన నిధులు వెనక్కి..
కుష్నపల్లి-సోమిని గ్రామాల మధ్య వంతెనల నిర్మాణానికి మంజూరైన నిఽఽధులు వెనక్కి మల్లాయి. ఈ రెండు వంతెనలు లేక సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, సాతసోమిని, గెర్రెగూడ, నాగేపల్లి, బండ లగూడ, ఇప్పలగూడ తదితర గ్రామాల ప్రజలకు ప్రతీ ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం లోనైతే వారు పడే బాదలు చెప్పదలిచినవి కావు. కనీసం వైద్యానికి వెళ్లాలంటే చుట్టూ వాగుల కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాగులు ఉప్పొంగినప్పుడల్లా బాహ్యప్రపంచంతో సంబంధా లు పూర్తిగా తెగిపోయి అవస్థలు పడుతున్నారు. నిఽధులు మంజూరై దాదాపు పదేళ్లు కావడంతో పనులు చేపట్టకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చిన నిధులను వెనక్కి తీసుకుంది. దీంతో వారి కష్టాలు షరా మామూలే. గతంలో పలువురు గర్బిణీలు వాగుల కారణంగా కాన్పు కోసం అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. నాగేపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి రెండేళ్ల క్రితం వాగు కారణంగా కాన్పు కోసం బయటకు వెళ్లలేక, వైద్యం అందక మృత్యువాత పడింది. అయినా ప్రభుత్వం వంతెనల విషయంలో చొరవ చూపలేక పోయిందని గిరి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- దశాబ్దాలుగా తీరని వేదన..
జిల్లా వ్యాప్తంగా వాగు అవతల ఉన్న గిరిజన గ్రామాల ప్రజల వేద. దశాబ్దాలుగా తీరడం లేదు. వాగులపై వంతెనలు నిర్మించకపోవడంతో ఎటు వెళ్లాలన్నా వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఆ గ్రామాలకు వెళ్లేందుకు అవస్థలు తప్పవు. కనీసం 108వాహనం కూడా వెళ్లలేని స్థితి నెలకొంది. దీంతో రోగం వస్తే దేవుడిపై భారం వేయాల్సిందే. వంతెనల నిర్మాణాలకు వచ్చిన నిధులు కూడా వెనక్కి మల్లడంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇక వంతెనల ఏర్పాటు కలగానే మిగి లింది. వంతెనల నిర్మాణానికి అప్పట్లో నిధులు మంజూరు కాగా ఎంతో సంతోషపడ్డ ప్రజలకు ఇప్పుడు నిధులు వెనక్కి మల్లడం చేదు జ్ఞాపకంగా మిగిలింది. దీంతో ప్రతి ఏటా తిప్పలు మాత్రం తప్పడం లేదని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే నాయకులు అనంతరం తమ గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలో లో లెవల్ వంతెనలపై బ్రిడ్జిలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.