తప్పిన ముంపు ముప్పు...!
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:11 PM
బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం విషయం పక్కన బెడితే... అది కుంగడం వ ల్ల మంచిర్యాల జిల్లా ప్రజలకు మాత్రం మేలు జరిగినట్లయింది. ప్రాజెక్టుల సముదాయం నిర్మించిన నాటి నుంచి వ ర్షాకాలంలో ప్రతియేటా మంచిర్యాల నగరాన్ని వరదలు చు ట్టుముట్టడం ఆనవాయితీగా మారింది.
కాళేశ్వరం కుంగడంతో గేట్లు ఎత్తివేసిన అధికారులు
గోదావరి ప్రవాహానికి తొలగిన అడ్డంకులు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 4.5 లక్షల క్యూసెక్కులు విడుదల
-అయినా పట్టణ దరిచేరని వరదలు
-ఊపిరి పీల్చుకున్న పుర ప్రజలు
మంచిర్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం విషయం పక్కన బెడితే... అది కుంగడం వ ల్ల మంచిర్యాల జిల్లా ప్రజలకు మాత్రం మేలు జరిగినట్లయింది. ప్రాజెక్టుల సముదాయం నిర్మించిన నాటి నుంచి వ ర్షాకాలంలో ప్రతియేటా మంచిర్యాల నగరాన్ని వరదలు చు ట్టుముట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో వర్షాకా లం వస్తుందంటే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపేవారు. అందుకు భిన్నంగా గత నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షా లకు వరదలు నగర దరిదాపులకు కూడా రాకపోవడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కిందటి ఏడాది కాళేశ్వరం సముదాయంలోని మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల కారణంగా కుం గిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందులో నీరు నిలువ చేయడం లేదు. ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి ఉంచడంతో గోదావరి ప్రవాహానికి అడ్డు తొలగిపోయింది. వరద నీరం తా నేరుగా ప్రవహించడంతో ఎక్కడ కూడా ప్రజలకు ఇ బ్బందులు తలెత్తలేదు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని సైతం పెద్ద మొత్తంలో గోదావరిలోకి విడుదల చేశారు. అ యినా ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. దీంతో కాళేశ్వరం ప్రా జెక్టు కుంగిపోయి ప్రజలకు మేలు చేకూర్చిందనే అభి ప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.
జలదిగ్బంధమైన జిల్లా కేంధ్రం....
2022 నుంచి వరుసగా మూడు సంవత్సరాలపాటు మం చిర్యాల నగరం వరద ముంపునకు గురైంది. 2022 జూలై 13న కురిసిన భారీ వర్షాలకు నగరం పూర్తిగా జలదిగ్బం ధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరి ఉప్పొంగి జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు బ్యాక్ వాటర్ ఇళ్ల లోకి చేరింది. దీంతో పాత మంచిర్యాల, రెడ్డి కాలనీ, ఎల్ ఐసీ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ నగర్, బైపాస్ రోడ్డు, ఆది త్య ఎన్‌క్లేవ్, వేంపల్లిలో రెండో అంతస్తు సగం వరకు ఇళ్లు నీట మునిగాయి. 48 గంటలుగా కాలనీలన్నీ నీటిలో ముని గి ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో బహుళ అంతస్థుల భవనాలు పూర్తిగా నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాలర్లు పెద్ద మొత్తం లో థర్మకోల్ తెప్పలు, నాటు పడవల ద్వారా ప్రజలను సు రక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం పూ ర్తిగా నీటిలో మునిగిపోయింది. అర్థరాత్రి రోగులను మరో చోటుకి తరలించాల్సి వచ్చింది. సుమారు రూ. 3 కోట్ల వి లువైన అదునాతన పరికరాలు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తినా...
ఇదిలా ఉండగా మొన్నటి భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రా జెక్టు 30 గేట్లు ఎత్తి 4.5 లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మూడు రోజుల పాటు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీరు నేరుగా వెళ్లి పోవడంతో భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా గోదా వ రిలోకి వెళ్లిపోయింది. దీంతో ముంపు ముప్పు లోతట్టు ప్రాం తాలకు తప్పినట్లయింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టు లో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎ త్తడంతో గోదావరి ఉప్పొంగినా ముంపు ప్రమాదం పెద్దగా చోటు చేసుకోలేదు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో గోదావరి ఉప్పొంగితే రాళ్లవా గు బ్యాక్ వాటర్‌తో ప్రమాదం పొంచి ఉంటుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాళ్ల వాగు వెంట నిర్మిస్తున్న కరకట్టలు పూర్తియితే నగరానికి ముంపు బాధలు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయి.