Share News

చెరువుకు చేరని చేపపిల్లలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 09:55 PM

నీలివిప్లవానికి వరుణ గండం పట్టుకుంది. వర్షాలు లేక జిల్లాలోని చే రువుల్లో పూర్తిస్థాయి నీళ్లు చేరక ఉచిత చేపపిల్లలు వ దిలే కార్యక్రమం ముందుకు సాగడం లేదు.

చెరువుకు చేరని చేపపిల్లలు

-వర్షాభావంతో టెండర్లలో ఆలస్యం

-నిరాశలో మత్స్యకారులు

నెన్నెల, జులై 26 (ఆంధ్రజ్యోతి) : నీలివిప్లవానికి వరుణ గండం పట్టుకుంది. వర్షాలు లేక జిల్లాలోని చే రువుల్లో పూర్తిస్థాయి నీళ్లు చేరక ఉచిత చేపపిల్లలు వ దిలే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. వందశాతం సబ్సిడీపై చేపవిత్తనాలు అందజేసి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్న సర్కారు ఆశయానికి ప్రతి కూల పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 381 చిన్న నీటి వనరులు, 9 పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 2.30 కోట్ల చేపపిల్లలను వద లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న చెరువులకు చేప విత్తనాలు చేరే పరిస్థితి కానరావడం లేదు. ఆగస్టులో భారి వర్షా లు కురిసి ఆశించిన స్థాయిలో నీరు చేరితే తప్ప చేపపి ల్లలను వదలడం సాధ్యమయ్యేలా లేదు. మరోవైపు చేప పిల్లల కొనుగోలుకు ఇప్పటికి ప్రభుత్వం టెండర్లు పిలు వలేదు. బిడ్లు తెరిచి కాంట్రాక్టర్ల ఎంపిక, టెండర్ల అనం తరం క్షేత్రస్థాయిలో సీడ్‌ తనిఖీ, విత్తన నాన్యత, సైజు సరి చూడటం లాంటి వాటితో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో మత్స్య సంపదతో స్వయంస మృద్ధి సాధించాలనుకున్న మత్స్యకారులు నిరాశ చెం దుతున్నారు.

-మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగు నింపే పథకం...

చేపల పెంపకం వృత్తిగా ఉన్న గంగపుత్రులు, మత్స్య సంపదపై ఆధారపడి జీవించే బడగుల జీవితాల్లో వెలు గులు నింపాలనుకుని ప్రభుత్వం ప్రతీ ఏటా వంద శా తం సబ్సిడీపై చేపపిల్లలను అందజేస్తోంది. చేపల పెం పకంతో పల్లెలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. పథకం అమలుతో మత్స్యకారులకు ప్రోత్సహం ఇవ్వడంతో పాటు ప్రజలకు సమృద్ధిగా పౌష్టికాహరం లభిస్తుందని అధికారులంటు న్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చేపవిత్తనా ల ను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేప డుతున్నారు. నిరుడు ఏర్పాట్లు చేయడంలో జాప్యం జ రగడంతో పథకం కొంత ఆలస్యంగా ప్రారంభం అ యింది. చెరువుల్లో నీరు తగ్గే సమయానికి వేసిన చేప లు ఆశించినంత బరువు తూగలేదు. ఈసారి ముందు గానే ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిం చారు. వర్షాలు లేకపోవడం ప్రతిబందకంగా మారింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సరి గ్గా వర్షాలు లేక చెరువుల్లో పూర్తిస్థాయి నీరు చేరలేదు. ఇంత వరకు చేప పిల్లలను వదిలే కార్యక్రమం మొదలు కాలేదు. ఆలస్యం అయినాకొద్ది చెరువుల్లో వేసిన చేప పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుందని మత్స్యకారులు వాపో తున్నారు. కొత్తగా నీరు చేరిన చెరువుల్లో అప్పటికప్పుడే నాచు, గడ్డి రాదని దీంతో మేత లేక చేపలు ఆశించినం త ఎదగవని చెబుతున్నారు. ఆలస్యంగా వదిలే చేప పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వమే దాణా సరఫరా చేయాలని కోరుతున్నారు.

-2.30 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం..

జిల్లాలో 381 చిన్న నీటి వనరులు ఉన్నాయి. వీటిలో 1.16 కోట్లు, మరో 9 పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 1.14 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. నీటిలోని కింది బాగంలో, మద్యలో, పైన ఆహా రాన్ని సేకరించుకునే బొచ్చె, రహు, మెరుగు రకాలను ఎంపిక చేశారు. ఈ రకాలు మన జిల్లా వాతావరణాని కి తట్టుకుని తక్కువ కాలంలో ఎక్కువ బరువు తూగు తాయని అధికారులంటున్నారు. సబ్సిడీ చేపలతో జిల్లా లోని 137 మత్స్య సహకార సంఘాల్లోని 7,918 మంది సభ్యులకు లబ్దీ పొందుతున్నారు. వీరితో పాటు ప్రత్య క్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాది లభిస్తుంది. అ లాంటి వారందరు సబ్సిడీ చేప పిల్లల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు.

-నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేయాలి

ఎల్లల రాజేష్‌, మత్స్య సహకార సంఘం డైరెక్టర్‌, నెన్నెల

గతంలో ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై అందజేసి న చేప విత్తనాలతో చెరువుల్లో మత్స్య సంపద విరివిగా పెరిగింది. ఈ ఏడు కూడా చేప పిల్లలను చెరువుల్లో వదలాలనుకున్నప్పటికి వరుణుడి కరుణ లేదు. ఇప్పటి కి రెండు నెలల వానాకాలం దాటి పోయింది. మొన్నటి వర్షాలకు చేరువుల్లో కొద్దిపాటి నీరు చేరింది. మరో ఒకటి రెండు భారీ వార్షాలు వస్తే చెరువులు మత్తడులు దూకుతాయి. టెండర్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటే చెరువులు నిండిన వెనువెంటనే చేప పిల్లలు వదులుకో వచ్చు. నాణ్యమైన మేలురకం చేప విత్తనాలనే పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

పథకం అమలుకు శాఖపరంగా సిద్ధంగా ఉన్నాం

-ఆర్‌. అవినాష్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

జిల్లాకు అవసరమైన చేపపిల్లల కోసం నివేదిక రూ పొందించి ప్రభుత్వానికి అందజేశాం. దాన్ని బట్టి ప్రభు త్వం టెండర్లను పిలిచి గుత్తేదారులను నియమిస్తుంది. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. చేపపిల్లలు వదలాలంటే చెరువుల్లో 50 శాతానికి పైగా నీరుండాలి. ఇరిగేషన్‌ శాఖ నుంచి ఎప్ప టికప్పుడు జలాశయాల్లో నీటినిల్వల గూర్చి నివేదికలు తెప్పించుకుంటున్నాం. 40 శాతానికి తక్కువే నీరున్నట్లు వారు చెబుతున్నారు. టెండర్‌ ప్రకియ్ర పూర్తి అయిన వెంటనే చేప విత్తనాలు సరఫరా చేస్తాం. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు చేసేందుకు శాఖపరం గా అన్ని విధాల సిద్దంగా ఉన్నాం.

Updated Date - Jul 26 , 2026 | 09:56 PM