kumaram bheem asifabad- చెరువుకు చేరని చేప
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:10 PM
మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లలు ఇంకా చెరువుకు చేరుకోలే దు. అసలే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొ న్నాయి. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రం గానే నీళ్లు ఉన్నాయి. అయినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో టెండల్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
- ప్రారంభం కానీ టెండరు ప్రక్రియ
- అదును దాటుతుండడంతో మత్స్యకారుల్లో ఆందో ళన
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లలు ఇంకా చెరువుకు చేరుకోలే దు. అసలే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొ న్నాయి. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రం గానే నీళ్లు ఉన్నాయి. అయినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో టెండల్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అదును దాటుతున్నా చెరువుల్లో చేపపిల్లలను వేయక పోవ డంతో ఆలస్యమవుతున్న కొద్దీ చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడు స్తున్నా చేపపిల్లలు అందకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అదును దాటిన తర్వాత పంపిణీ చేస్తే అవి ఎదిగేందుకు సమయం లేక నష్టపోయే ప్రమాదం ఉంది. జూన్, జూలై మాసాల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు
- జిల్లాలో 76 మత్స్యకార సంఘాలు..
జిల్లాలో 76 మత్స్య పారిశ్రామిక సహకార సంఘా లు ఉండగా ఇందులో 3,400 మంది మత్స్యకారులు న్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యలు విక్రర ుుంచడమే జీవనాధారం. జిల్లాలో 232 చెరువులు, 4 ప్రాజెక్టులు, 11 పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా 1.44 కోట్ల వరకు సీడ్‌ను వదలనున్నారు. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నా రు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం వరకు, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం వరకు చేప పిల్లలను వదలను న్నారు. ఈ ఏడాది చెరువుల్లో చేపల విడుదల అలస్యం కానుంది. గతంలో టెండర్లు దక్కించుకొని చేప పిల్లలు పంపిణీ చేసిన పలువురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ. 2.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో చేపపిల్లలను సరఫరా చేయడాని కి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. సాధారణం గా ఏప్రిల్ మేలో టెండర్లు పిలువాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు టెండర్లు పిలువలేదు. ఈ ఏడాది ప్రభు త్వం సకాలంలో బడ్జెట్ కేటాయింపు జరుగక పోవడం వల్ల అలస్యమైందని చెబుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు..
-సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అఽధికారి
ఈ ఏడాది జలశయాల్లో చేపపిల్లల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఏప్రిల్, మే నెలల్లో టెండరు ప్రక్రియ పూర్తి కావాలి. గతంలో చేపపిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులపై ప్రభుత్వానికి నివేదికను పం పాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ ప్రారంచేందుకు చర్యలు తీసుకుంటాం.