తరలిపోయిన చేపల పెంపకం యూనిట్...!
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:37 PM
రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొర్ర మొట్టల (చేప లు) పెంపకం యూనిట్ జిల్లా నుంచి పొరుగు జిల్లా అయిన కరీంనగర్‌కు తరలిపోయింది. చేపల పెంపకం యూనిట్ ఏర్పాట్లలో ఇక్కడ జాప్యం కారణంగా మరో చోటుకు తరలిపోయినట్లు తెలుస్తోంది.
-ఇక్కడ ఏర్పాట్లు ఆలస్యం కావడమే కారణం
-కరీంనగర్‌లోని లోయర్ మానేరుకు తరలిస్తూ ఉత్తర్వులు
-మరో యూనిట్ ఇక్కడే ఉంటుందంటున్న మత్స్సశాఖ
-అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
మంచిర్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొర్ర మొట్టల (చేప లు) పెంపకం యూనిట్ జిల్లా నుంచి పొరుగు జిల్లా అయిన కరీంనగర్‌కు తరలిపోయింది. చేపల పెంపకం యూనిట్ ఏర్పాట్లలో ఇక్కడ జాప్యం కారణంగా మరో చోటుకు తరలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అఽధికా రుల నిర్లక్ష్యం పట్ల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గుడిపేట సమీ పం లోగల ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద భారీ యూనిట్ చేప ట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్ర భుత్వ సహకారంతో రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ప్రాజెక్టు కోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు సూచనల మేరకు రెవెన్యూ అ ధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో సర్వే నెంబర్లు 417,418,423,424, 425,426,433,434,435, 464లలో మొ త్తం 85.10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేర కు జిల్లా మత్స్యశాఖ అధికారులు హైదరాబాద్‌లోని ప్ర ధాన కార్యాలయానికి 2025 ఏప్రిల్ నెలలో ప్రతిపాద నలు కూడా పంపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కి చెందిన మంచి నీటి చేపల పెంపకం సంస్థ సీఐఎస్‌ఏ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్) సాంకేతిక సహకారంతో స్థాపించనుండగా, ఆదిలోనే పొ రుగు జిల్లాకు తరలిపోవడం గమనార్హం.
రాష్ట్ర చేపగా గుర్తింపు....
ప్రజలు అమితంగా ఇష్టపడే కొర్రమొట్ట చేపను దక్షి ణ తెలంగాణలో బొమ్మె చేపగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 600 వరకు ధర పలు కుతోంది. ఈ చేపకు ప్రజల్లో మంచి డిమాండ్ ఉండగా, క్రమంగా వాటి పెంపకం తగ్గుముఖం పడుతోంది. దీన్ని తినేందుకు ఎగువ మధ్యతరగతి, సంపన్నులు అమితం గా ఇష్టపడతారు. కొర్రమొట్టను 2016లో ప్రభుత్వం రా ష్ట్ర చేపగా గుర్తించింది. ఈ రకం చేపల జాతిని కాపా డటం ద్వారా వాటి సంఖ్యను మరింతగా పెంచి, ప్రజల కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చే పడుతోంది. ఈ నేపథ్యంలో కొర్రమొట్ట చేపల పెంప కాన్ని పెంచేలా ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణ యించింది. ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎల్లంపల్లి జలాశయం వద్ద చేపట్టనున్న ప్రాజెక్టులో కొర్రమొట్టతోపాటు ఆ జా తికే చెందిన బురద మొట్టలు, తదితర రకాల చేపల విత్తన కేంద్రం, వాటి పెంపకానికి అవసరమైన హేచరీ లు ఏర్పాటు చేసి, సంరక్షించాల్సి ఉంది. ప్రాజక్టు ద్వారా ఉత్పత్తయ్యే పిల్లలను రాష్ట్రవ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. కొర్రమొట్ట పిల్లలను అస్త మా వ్యాధిగ్రస్తుల కోసం మృగశిర కార్తెలో పంపిణీ చేసే చేప ప్రసాదంలో వాడతారు. ప్రాజెక్టులో పెంచిన కొ ర్రమొట్టల ప్రజల వినియోగానికి వీలుగా చేపల మార్కె ట్లలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర అవసరాలు పో ను మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమ తి చేస్తారు. ఎల్లంపల్లి జలాశయంలో కొర్రమొట్ట సం రక్షణ కేంద్రం ఏర్పాటు పనులు జరుగుతుండగానే, హ ఠాత్తుగా కరీంనగర్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆలస్యం కారణంగానే....
కొర్రమొట్టల చేపక పెంపకం యూనిట్ ఏర్పాటు ప నుల్లో జాప్యం కారణంగానే అది కరీంనగర్‌కు తరలి పోయిందన్న ప్రచారం జరుగుతోంది. యూనిట్ భాగం గా ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో మర్రల్ క్లస్టర్ (కొర్రమొట్టల పెంపకం), సెం టర్ ఆఫ్ ఎక్సలెన్స్ (చేపల సంరక్షణ కేంధ్రం) అనే రెం డు విభాగాలు ఉంటాయి. 2024లో ప్రాజెక్టు మంజూరు కాగా, అవసరమైన భూముల కేటాయింపులో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. మత్య్సశాఖ అధికారులు భూ ములను గుర్తించి, ప్రభుత్వానికి గతేడాది ఏప్రిల్ నెలలో ప్రతిపాదనలు పంపగా, ఈ సంవత్సరం మే 2వ తేదీన భూములు కేటాయిస్తూ హైదరాబాద్‌లోని ఫిషరీష్ డి పార్టుమెంట్ డైరెక్టర్ నిఖిల సర్కులర్ జారీ చేశారు. అధికారికంగా భూములు కేటాయించడంలో దాదాపుగా ఏడాదికి పైగా ప్రభుత్వం సమయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన యూనిట్ ను కరీంనగర్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ ఏర్పాటు చేస్తే చేపలు పట్టడం వల్ల ఇక్కడి జాలర్లకు చేతినిండా పని ఉండటంతోపాటు జిల్లా వా సులకు కొర్రమొట్ట చేప అందుబాటులో ఉండేది. అలా గే కొర్రమొట్టల పెంపకంలో జిల్లా ప్రసిద్ధిగా నిలిచేది. యూనిట్ తరలించిన కారణంగా జాలర్లకు ఉపాధి కో ల్పోవడమేగాక, కొర్రమొట్ట లాంటి అధిక పోషక విలు వలుగలిగిన చేపను విరివిగా తినే అవకాశం ప్రజలకు చేజారినట్లయింది. ఇదిలా ఉండగా జిల్లా మత్స్యశాఖ అ ధికారులు మాత్రం యూనిట్‌లో కొంత భాగం మాత్రమే తరలిపోయినట్లు చెబుతుండటం గమనార్హం.
మర్రల్ క్లస్టర్ ఇక్కడే ఉంది....మత్స్యశాఖ జిల్లా ఏడీ అవినాష్
చేపల పెంపకం యూనిట్‌లో ప్రధానమైన విభాగం మర్రల్ క్లస్టర్ జిల్లాలోనే ఉంది. దాని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరో విభాగమైన సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్‌ను మాత్రమే కరీంనగర్‌కు తరలించారు. భూము లు కేటాయించడంతో ఆలస్యం కారణంగా ఆ విభాగం కరీంనగర్‌లోని ఎల్‌ఎండీకి తరలిపోయింది. మానేరు వద్ద చేపల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తరలించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.