Share News

సాదాబైనామాలపై ముందుకే...!

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:43 PM

సాదాబైనామా లతో భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ముందుకే వె ళ్తోంది. హై కోర్టు ఉత్తర్వులతో సాదాబైనాల అంశానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడగా, విదివిధానాలపై ప్రభుత్వం సకరత్తు చేస్తోం ది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ’ధరణి’ భూ సమ స్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కుముడులను తెచ్చిపెట్టింది.

సాదాబైనామాలపై ముందుకే...!

-విదివిధానాలపై ప్రభుత్వం కసరత్తు

-2016 నుంచి క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం

-అసైన్డ్‌ భూముల పరిష్కారం లబ్ధిదారుల ఎదురు చూపు

-రెవెన్యూ సదస్సులో 30వేల పైచిలుకు దరఖాస్తులు

-ధరణిలో పరిష్కారంకాని భూ సమస్యలు

మంచిర్యాల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా లతో భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ముందుకే వె ళ్తోంది. హై కోర్టు ఉత్తర్వులతో సాదాబైనాల అంశానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడగా, విదివిధానాలపై ప్రభుత్వం సకరత్తు చేస్తోం ది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ’ధరణి’ భూ సమ స్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కుముడులను తెచ్చిపెట్టింది. ఆర్జీల పరిష్కారం కోసం రైతులు కాళ్ల రిగేలా తిరిగినా స్పందనలేకుండా పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ హయాంలో ’ధరణీ ’ స్థానంలో ప్రవేశపెట్టిన ’భూ భారతి’ ద్వారా సాదాబైనామాల సమస్యలకు పరిష్కారం చూపే ది శగా అడుగులు వేస్తుండటంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తు న్నాయి. భూ భారతి పోర్టల్‌ కింద సాదాబైనామాల సమస్య లపై రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను సైతం ఆహ్వానించిం ది. ప్రభత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పెద్ద మొ త్తంలో దరఖాస్తులు వచ్చాయి. అధికారులు స్వీకరించిన ద రఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామా, అసైన్డ్‌ భూముల కు సంబంధించినవి కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా పరిష్కారం కోసం 30,405 దరఖాస్తులు వ చ్చాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో సాదాబైనామాలతో భూ ముల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు.

సమస్యల పరిష్కారం దిశగా....

ప్రభుత్వం ఆర్వోఆర్‌-2020-25 భూ భారతి చట్టాన్ని తీ సుకు వచ్చినందున ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. గ త ప్రభుత్వం అంతకు ముందున్న రైతులకు భూ హక్కు లు కల్పించే పట్టాదారు పాసు పుస్తకాల చట్టం -1971ని ర ద్దు చేసి కొత్తగా పాసు పుస్తకాల చట్టం -2020 పేరిట ధర ణిని తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ఆశించిన ఫలితా లను ఇవ్వకపోగా, కొత్త సమస్యలను తీసుకొచ్చింది. ఈ క్ర మంలో కాంగ్రెస్‌ సర్కార్‌ గత ఏప్రిల్‌ 14న ధరణి స్థానం లో కొత్తగా భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో బాగంగా మండలాల వారీగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సు లు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించింది.

మొదలైన కార్యాచరణ...

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సాదాబైనా మా కూడ ఒకటి. గతంలో గ్రామాల్లో చాలా మంది రైతులు రెవెన్యూ స్టాంప్‌ పేపర్లు, తెల్లకాగితాలపై భూముల క్రయవి క్రయాలు జరిపేవారు. ఈ విధానంలో భూములపై హక్కు సంపూర్ణంగా లభించేది కాదు. ఈ విషయమై దృష్టిసారిం చిన గత ప్రభుత్వం సాదాబైనామాల సమస్యను పరిష్కరిం చేందుకు 2016లో జీవో నెంబర్‌ 153ను తీసుకొచ్చింది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చ ట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం 2020 అక్టోబర్‌ 12న కూడ జీవో నెంబర్‌ 112ను జారీ చేసింది. సాదాబైనామాల సమస్యల పరిష్కా రానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా వేసింది. అయినా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఆ సమస్య పరిష్కా రం కాకుండానే 29 అక్టోబర్‌ 2020లో కొత్త పట్టాదారు పా సుపుస్తకాల చట్టాన్ని తెచ్చింది. ఎన్నిసార్లు జీవోలు తెచ్చినా... పరిష్కారం చూపకపోవడంతో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభుత్వం కేవలం జీవోల జారీతోనే సరిపెట్టిందని, సా దాబైనామాలపై తహసీల్దార్‌లకు అధికారాలు ఇచ్చినప్పటికీ, వాటిని పరిష్కరించేందుకు సరైన మార్గదర్శకాలను విడు దల చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు అవ సరమైన కార్యాచరణ ప్రారంభించింది. సాదాబైనామా లతో పాటు అసైన్డ్‌ భూముల సమస్యల పరిష్కారం కోసం కూ డా దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో సాదాబైనామాల అంశమై పలువురు హైకోర్టుకు వెళ్లడం, ఈ అంశంపై స్టే రా వడం జరిగింది. ప్రభుత్వం కూడాఎటూ తేల్చుకోలేని సంక ట స్థితిలోకి వెళ్లింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వె లువడినందున విధి విధానాలు రూపొందించి సమస్యల కు పరిష్కారం చూపేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా 2020 వరకు ఉన్న సాదాబైనామాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. రెవెన్యూ సదస్సు ల్లో స్వీకరించిన 30,405 దరఖాస్తుల్లో నిబందనలకు విరు ద్దంగా ఉన్న 24,800 అప్లికేషన్లను తిరస్కరించగా, మిగిలిన 5572 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 3143 విచారణ జరుపగా, మరో 2532 దరఖాస్తుల విచారణ జరగాల్సి ఉంది.

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా....

గతంలో సాదాబైనామాల క్రమబద్దీకరణకు పట్టేదారు రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధన ఉండేది. ఒకవేళ పట్టేదారు బతికి ఉండని పక్షంలో అప్పటికే రాసుకున్న సాదాబైనామాల విషయమై సరియైన విదివిధానాలను ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించలేదు. దీంతో సాదాబైనామాల అంశం ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వం పట్టేదారుతో పనిలేకుండా కొనుగోలుదారుకు హక్కులు సంక్రమించే విధంగా చర్యలు చేపడుతోంది. క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న భూమి చుట్టు పక్కల ఉన్న వారిని విచారించాలనే నిర్ణయానికి వచ్చింది. వారి అభిప్రాయాలు నమోదు చేయడంతోపాటు కొనుగోలుదారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకోవడం ద్వారా నేరుగా క్రమబద్దీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై కసరత్తు జరుగుతుండగా, త్వరలో విదివిధానాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 29 , 2026 | 11:43 PM