మంచిర్యాల కార్పొరేషన్‌కు తొలి ఎన్నికలు...
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:38 PM
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించిన తరువాత తొలి సారిగా ఎన్నికలు జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-70 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా ఆవతరణ
-60 డివిజన్లలో కొలువుదీరనున్న పాలకవర్గం
-కార్పొరేటర్ పదవుల కోసం పోటాపోటీ
-ప్రథమ మేయర్ పదవిపైనా పలువురి ఆసక్తి
మంచిర్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించిన తరువాత తొలి సారిగా ఎన్నికలు జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వ హించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే వార్డుల విభ జన, ఓటర్ల తుది ముసాయిదా జాబితా ప్రచురణకు తేదీని ఖరారు చేస్తూ షెడ్యూల్ విడుదల చేసిన విష యం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తికాగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవ కాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం అవుతుండగా, మున్సిపాలిటీల్లో ఎ న్నికల హడావుడి ప్రారంభమైంది. జిల్లాలో మంచిర్యాల తోపాటు చెన్నూరు, లక్షెట్టిపేట, క్యాతన్‌పల్లి, మందమ ర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 173 వార్డులు ఉన్నాయి. ఇందులో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించగా, 60 డివిజన్‌లలో పాలక వర్గం కొలువుదీరనుంది.
70 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా...
మంచిర్యాల 1956లో తొలిసారిగా మున్సిపాలిటీగా అవతరించగా అంతకు ముందు గర్మిళ్ల పేరు వ్యవహా రంలో ఉండేది. మున్సిపాలిటీగా ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తరువాత ప్రస్తుతం కార్పొరేషన్ హోదాలో బల్దియాకు తొలి ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో 36 వార్డులు ఉండగా, కౌన్సిలర్లతో కూడిన పాలక వ ర్గం ఉండేది. ప్రస్తుతం 60 డివిజన్‌లతో కార్పొరేషన్‌గా రూపాంతరం చెందగా, ఇక మీదట కార్పొరేటర్లు పరి పాలన కొనసాగించనున్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పు డు వార్డుల పరిధి చిన్నదిగా ఉండగా, కార్పొరేషన్‌గా మారిన తరువాత డివిజన్‌ల రూపు రేఖలు కూడా మా రిపోయాయి. డివిజన్‌ల పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా ఘననీయంగా పెరిగింది. దీంతో హోదా కోసమైనా కా ర్పొరేటర్‌గా బరిలోకి దిగాలన్న ఔత్సాహికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కార్పొరేటర్‌గా ఎన్నికైతే రాజకీయంగా మరో మెట్టు ఎక్కినట్లవుతుందన్న భా వనతో అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
11 మంది చైర్ పర్సన్ల సేవలు...
మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడ్డ తరువాత తొలి సారిగా ఎన్నికలు జరుగుతుండగా, అంతకు ముందుకు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 11 మంది చైర్ పర్సన్‌లు గా సేవలందించారు. మంచిర్యాల మున్సిపల్ ప్రథమ చైర్‌పర్సన్‌గా పట్టణానికి చెందిన కేవీ రమణయ్య పదవిని అలంకరించగా 1956 నుంచి 1957 వరకు కొనసాగారు. 1957 నుంచి 1959 వరకు శ్రీరామోజు లక్ష్మీకాంతం, 1959 -1962 ముత్తినేని అర్జున్‌రావు, 1963 -1971 గడ్డం నర్సింహారెడ్డి పదవులు అలంకరించారు. అనం తరం 1971- 1982 వరకు ప్రత్యేకాధికారి పాలన విధించారు. 1982- 1985 వరకు చల్లూరి చంద్రయ్య చైర్‌పర్సన్‌గా వ్యవహరించగా, 1985-1986 కొప్పుల రాజలిం గు, 1986 -1987 తిరిగి ప్రత్యేకాధికారి పాలన, 1987 -1992 వరకు చైర్‌పర్సన్‌గా రాచకొండ కృష్ణారావు, 1992-1995 వరకు ప్రత్యేకాధికారి పాలన, 1995- 2000 రాచకొండ కృష్ణారావు, 2000 -2005 మంగీలాల్ సోమాని, 2005 -2005 ప్రత్యేకాధికారి పాలన, 2005 -2010 రాచకొండ కృష్ణారావు, 2010 -2014 ప్ర త్యేకాధికారి పాలన, 2014 నుంచి 2019 వరకు మామిడిశెట్టి వసుంధర, 2019 నుంచి ప్రత్యేకాధికారి పాలన 2020- 24 వరకు పెంట రాజయ్య, 2024 నుంచి 2025 జన వరి వరకు ఏడాది పాటు రావుల ఉప్పలయ్య చైర్మన్ గా సేవలందించారు.
మేయర్ పదవిపై పలువురి గురి...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పద విని చేపట్టేందుకు పలువురు ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి మేయర్ పదవి ని అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేందుకు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి ఇంచు మించు ఎమ్మెల్యే స్థాయిది కావడంతో సహజం గానే ఆ పదవి కోసం పోటీ అధికంగా ఉండనుంది. కార్పొరేటర్లను అధిక సంఖ్యలో గెలిపించుకోవడం ద్వారా మేయర్ పదవిని తమ ఖాతాలో వేసుకోవాలన్న ఉత్సుకతతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్ ఎస్‌లు మేయర్ పదవి కోసం ఆరాటం చెందుతున్నా యి. ఇందులో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక లో ఆచితూచి అడుగులు వేయాలనే ఆలోచనతో ఆ యా పార్టీల ముఖ్య నేతలు ఉన్నారు. కొందరు ఆశావ హులు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ప ట్ల హామీ ఇస్తేనే కార్పొరేటర్‌గా బరిలో దిగాలన్న ఆ లోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరుపున కార్పొరేటర్‌గా బరిలో దిగడం ద్వారా మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పీఠాన్ని అదిరోహించా లన్న ఆలోచనతో ఉన్నవారు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తీ వ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రిజర్వేషన్లు వర్తించి న పక్షంలో అవకాశాన్ని చేజారనివ్వకూడదన్న గట్టి ప ట్టుదలతో ఐదారుగు వ్యక్తులు ఉన్నట్లు నగరంలో ప్ర చారం జరుగుతోంది. అయితే డివిజన్‌ల వారీగా రిజర్వే షన్లు ఖరారైతేనే ఆశావహుల భవిష్యత్తు ఏమిటనేది తేలనుంది.