Share News

గాంధీభవన్‌లో గలాటా

ABN , Publish Date - May 28 , 2026 | 03:37 AM

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)పై గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ నేతల మధ్య గలాటా చోటు చేసుకుంది.

గాంధీభవన్‌లో గలాటా

  • మంత్రులు పొన్నం, అజారుద్దీన్‌ల సమక్షంలో బాహాబాహీకి దిగిన ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అలీ

  • అజారుద్దీన్‌ పక్కన కూర్చునే విషయమై గొడవ

  • ఇది చిన్న గొడవేనంటూ.. కలిసిపోయిన నేతలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)పై గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ నేతల మధ్య గలాటా చోటు చేసుకుంది. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, మంత్రి అజారుద్దీన్‌, ప్రభుత్వవి్‌పలు బల్మూర్‌ వెంకట్‌, అద్దంకి దయాకర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఒకవైపు కొనసాగుతుండగా మంత్రి అజారుద్దీన్‌ పక్క సీట్లో ఎవరు కూర్చోవాలన్న అంశంపై ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ మధ్య వివాదం మొదలైంది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంత్రులు వారిస్తున్నా గొడవ కొనసాగడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. అయితే, సమావేశంలో గొడవ పడిన నేతలు ఫిరోజ్‌ ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ కొద్ది పేపటికే కలిసి పోవడం విశేషం. గొడవ అనంతరం ఉస్మాన్‌ అల్‌ హజ్రీ మాట్లాడుతూ ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవని, తాను ఫిరోజ్‌ఖాన్‌కు క్షమాపణలు చెప్పానని వెల్లడించారు. ఫిరోజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ చిన్న విషయంలో గొడవ అయిందని, ఉస్మాన్‌ తనకు పెద్దన్నలాంటి వారని చెప్పారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల మధ్య చోటుచేసుకున్నది కేవలం చిన్న అపార్థమేనన్నారు. ఫిరోజ్‌ ఖాన్‌, ఉస్మాన్‌.. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకులని, గొడవ తర్వాత కాసేపట్లోనే పరస్పరం మాట్లాడుకొని కలిసిపోయారని తెలిపారు.

Updated Date - May 28 , 2026 | 03:37 AM