అగ్ని ప్రమాదాలతో అడవులు, ప్లాంటేషన్‌లకు నష్టం
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:34 PM
అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల అడవులు, ప్లాంటేషన్‌లకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అటవీ అభి వృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ముదిగుంట నీలగిరి ప్లాంటేషన్‌లో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.
జైపూర్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల అడవులు, ప్లాంటేషన్‌లకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అటవీ అభి వృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ముదిగుంట నీలగిరి ప్లాంటేషన్‌లో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో మానవుల నిర్లక్ష్యం వల్లనే కొన్ని చోట్ల అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా యన్నారు. దీంతో చెట్లు కాలిపోవడమే కాకుండా ఎన్నో జీవరాశులు చని పోతున్నాయన్నారు. అడవుల్లో బీడీలు, సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడే యవద్దని, ఎవరు కూడా నిప్పు పెట్టవద్దని సూచించారు. అడవులు మా నవాళి మనుగడకు పర్యావరణకు పరిరక్షణకు ఎన్నో రకాలుగా తోడ్పడ తాయన్నారు. ప్రజలందరు అటవీ శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్య క్రమంలో సిబ్బంది రాజేష్, శంకర్, సంజీవ్ పాల్గొన్నారు.