kumaram bheem asifabad- అగ్గి.. రాజుకుంటే బుగ్గే
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:27 PM
వేసవి కాలం ప్రారంభం కాగానే అగ్ని ప్రమాదాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉక్కపోతతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ సరఫరాలో వైరింగ్ ఇబ్బందుల వలన షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రతీ ఏడాది అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది
- పరిధి ఎక్కువ.. ఫైరింజన్లు తక్కువ
- అప్రమత్తతోనే ప్రమాదాల నివారణ
- వారంలోనే మూడు చోట్ల ఘటనలు
కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలం ప్రారంభం కాగానే అగ్ని ప్రమాదాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉక్కపోతతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ సరఫరాలో వైరింగ్ ఇబ్బందుల వలన షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రతీ ఏడాది అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. గత ఏడాది కూడా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిం ది. విలువైన ఆస్తులను కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం పెరుగుతూ వస్తోంది. ప్రమాదాలకు వేసవి కాలంతో పాటు అనేక కారణాలు ఉన్నప్పటికీ అగ్ని ప్రమాదాల నివారణకు మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. 25 కిలో మీటర్లకు ఒక అగ్నిప్రమాద కేంద్రం ఉంటే ప్రమాదాలను నివారించే అవకాశాలున్నాయి. కానీ దశాబ్ద కాలంగా ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతోనే కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం జరుగుతోందని ఆరోపణలున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే ఈ వారంలోనే మూడు ప్రమాదాలు జరిగాయి. కాగజ్‌నగర్‌లోనే 17న పత్తి దుకాణంలో మంటలు చెలరేగాయి. 18న పరుపుల దుకాణంలో, 21న గ్యాస్ లీకయి మంటలు అంటుకున్నాయి.
- ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో కేవలం నియోజకవర్గానికి ఒకటి చొప్పు న రెండు అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉన్నా యి. దశాబ్దాలుగా కేవలం ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లోని అగ్నిమాపక కేంద్రాలతోనే అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రాలు కేవలం ప్రతిపాధనలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వం కోట్లాది నిధులున్నా అగ్ని మాపక కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో వందలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉండి 15 మండలాలు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలున్నాయి. కేవలం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, కాగజ్‌గనర్‌లో మాత్రమే అగ్నిమాపక కేంద్రాలు ఉండడంతో కాగజ్‌నగర్ డివిజన్‌లోని కౌటాల, బెజ్జూరు, సిర్పూర్ (టి), చింతలమానెపెల్లి, పెంచికల్ పేట, దహెగాం, కాగజ్‌నగర్ మండలాలు ఉన్నాయి. వీటిలో మారూమూల గ్రామాలు 70, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. మరో వైపు ఆసిఫాబాద్ డివిజన్‌లోని కెరమెరి, వాంకిడి, జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో ప్రమాదాలు సంభవిస్తే తీవ్రత పెరుగు తోంది. జిన్నింగ్ మిల్లుల్లో ఏటా పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలోనే భట్టుపల్లి చౌరస్తాలోని పత్తి దుకాణంలో, మార్కెట్ ఏరియాలో పరుపుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. సుభాష్ కాలనీలో అగ్నిప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.
- జైనూరు, కౌటాలాలో..
జైనూరు, కౌటాలాలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. జిల్లాలో 100 కిలోమీటర్ల మేర ఉన్న మారుమూల గ్రామాలు ఉండడం రోడ్లు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రమాద స్థలానికి సకాలంలో చేరుకోవాలంటే ఇబ్బందిగా మారుతోందని అగ్నిమా పక సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో ఇంకా పలు ఫైర్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సొంత భవనం లేక కాగజ్‌నగర్ అగ్నిమాపక భవనం పాత పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ టాయిలెట్స్, తాగునీరు, ప్రహారి గోడ లేదు. జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాల్లో సౌకర్యాలు, తదితర విషయాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏళ్గు గడుస్తున్నా నిధులు రావడం లే దు. జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లలో 100పైగా అగ్నిప్రమాదాలు సంభవించాయి. కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినా, ప్రమాదాల తీవ్రతను తగ్గించి ఆస్తి నష్టం జరగకుండా అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు.
ఇలా చేయాలి..
ఫ పిల్లలకు, అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాసులు
వంటి మండే వస్తువులు ఇవ్వకూడదు.
ఫ కాల్చిన సిగరెట్లు, అగ్గిపుల్లలు ఆర్పకుండా
బయట పడేయకూడదు.
ఫ ఐఎస్‌ఐ మార్కు ఉన్న విద్యుత్తు
పరికరాలు ఉపయోగించాలి, విద్యుత్ వైరింగ్
విషయంలో నాణ్యత ప్రమాణాలు తప్పసరిగా
పాటించాలి
ఫ గదుల్లో వెలుతురు, గాలి ఉండేలా
చూసుకోవాలి
ఫ పాడైన గ్యాస్ పైపులను వెంటనే
మార్చుకోవాలి
ఫ గ్యాస్ వాడకం పూర్తయిన వెంటనే
రెగ్యులేటర్ బంద్ చేయాలి
ఫ గడ్డివాములు, నివాస గృహాలకు దూరంగా
ఉండేలా చూసుకోవాలి
ఫ ఇంటి వంటగదిలో ముఖ్యంగా రిఫ్రిజిరేటర్
లేకుండా చూసుకోవాలి.
ఫ సిలిండర్ రెగ్యులేటర్ వద్ద మంట వస్తే
అది వ్యాపించకుండా వెంటనే భయాందోళన
చెందకుండా ఒక బక్కెట్టును రెగ్యులేటర్‌పై
బోర్లించాలి
ఫ అనంతరం రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసుకొని
ప్రమాదాలను నివారించవచ్చు
ఫ ఇంట్లోని వారు ఊరికి వెళ్లేటప్పుడు విద్యుత్
మెయిన్ ఆఫ్ చేసి వెళ్లాలి
ఫ గ్యాస్ లీకయిన సందర్భంలో విద్యుత్
స్విచ్‌లు ఆన్, ఆప్ చేయకూడదు
జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు..
అగ్నిమాపక కేంద్రం - ఫోన్ నంబరు
కాగజ్‌నగర్ - 8712699192
ఆసిఫాబాద్ - 8712699190