kumaram bheem asifabad- నిప్పు ముప్పు
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:09 PM
వేసవి కాలం సమీపిస్తుండడంతో అడవుల్లో వన్యప్రాణు లతో పాటు అటవీ సంపదకు నిప్పు ముప్పు పొంచి ఉన్నందున అటవీ శాఖ అప్రమత్తమైంది. వేసవిలో అడవులను రక్షించుకోవడంపై అటవీ శాఖ దృష్టి సారించింది. ఒకవేళ ప్రమాదం జరిగినా ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నా రు.
- అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
- ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
బెజ్జూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలం సమీపిస్తుండడంతో అడవుల్లో వన్యప్రాణు లతో పాటు అటవీ సంపదకు నిప్పు ముప్పు పొంచి ఉన్నందున అటవీ శాఖ అప్రమత్తమైంది. వేసవిలో అడవులను రక్షించుకోవడంపై అటవీ శాఖ దృష్టి సారించింది. ఒకవేళ ప్రమాదం జరిగినా ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నా రు. ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో అడవికి నష్టం కలగకుం డా ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో 6,04,172ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో మొత్తం 11రేంజ్‌లు, 79సెక్షన్లు, 245బీట్లు, 846కం పార్టుమెంట్లు ఉన్నాయి. సాధారణంగా వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభం వించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అడవుల్లో ఆకులన్నీ రాలి ఉండడంతో ఎవరైనా నిప్పు పెడితే అడవంతా తగలబడే అవకా శం ఉంటుంది. అటవీ ప్రాంతలాలకు పశువులను తీసుకొని వెళ్లిన పశువుల కాపరులు, తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలు , వంట చెరుకు కోసం వెళ్లే రైతులు కాని లేదా ఇతరులు ఎవరైనా బీడీలు, చుట్టలు తాగి పడేస్తే ఎండిన ఆకులకు అంటుకొని మంటలు వ్యాపించి పెద్దమొత్తంలో అడవులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో చెట్లు కాలిపోవడంతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న వణ్యప్రాణులకు సైతం ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
- వన సంపదను కాపాడుకునేందుకు..
వన సంపదను కాపాడుకునేందుకు అటవీశాఖ గత కొంత కాలంగా కొత్త పద్ధతిని అమలు చేస్తోంది. ఇందులో బాగంగా అటవీ ప్రాంతంలో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. కాలిబాటలో ఐదు మీటర్ల వెడెల్పుతో వీటిని ఏర్పాటు చేస్తారు. చుట్టు పక్కల ఉన్న ఎండిన ఆకులు ఈ బాటలో పరిచి నిప్పు పెడతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు నిప్పం టుకున్నా ఈ దారుల వరకే మంటలు వ్యాపించి ఆగిపోతాయి. మిగితా ప్రాంతానికి మంటలు వ్యాపించకుండా ఫైర్‌లైన్స్ అరికడుతుంది. ఇలా జి ల్లా వ్యాప్తంగా ప్రతి వేసవి కాలంలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వేసవి ప్రారం భంలో ముందస్తు చర్యలు చేపడతారు. ఈ ఫైర్‌లైన్స్ దాదాపు రెండు కిలో మీటర్ల మేర ఏర్పాటు చేసి ఆకులను ఒక్కదగ్గర ఏర్పాటు చేయ డం వల్ల అడవుల్లో అగ్గి రగలకుండా అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇలా ఏటా వేసవి కాలంలో అటవీ శాఖ అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నా కొంత మేరా అడవికి నష్టం జరుగుతూనే ఉంది.
- అనునిత్యం నిఘా..
అటవీ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా అగ్ని ప్రమాదాలు జరక్కుండా గస్తీ నిర్వహిస్తారు. ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేసి ఎండిన ఆకులు పరిచి అవి పూర్తిగా కాలిపోయే వరకు కాపలా ఉంటారు. అంతే కాకుండా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపిం చినా తక్షణమే అటవీ అధికారులు పరుగులు తీసి మంటలను అదుపులోకి తెస్తారు. దీని ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. మానవ నిర్లక్షమో మరేదైనా కావచ్చు అటవీ ప్రాంతంలో రహ దారి గుండా ప్రయా ణికులు, పశువుల కాపర్లు బీడీలు, చుట్టలు విసిరేయడంతో తరచూ అటవీ ప్రాంతం లో కార్చిచ్చుతో అగ్నిప్రమాదాలకు కారణమవుతోం ది. అటవీ ప్రాంతంలోని ఏళ్లనాటి చెట్లు, అమూల్య మైన ఔషధ మొక్కలు కాలి బూడిద కావడంతో పాటు వన్యప్రాణులు సైతం మంటల్లో బిక్కుబిక్కు మంటున్నాయి. చిన్న పెద్ద జంతువులతో పాటు జీవవైవిద్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. గంటల వ్యవదిలో మంటలు వ్యాపించి వేలాది ఎకరాల్లో అటవికి నష్టం వాటిల్లుతోంది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ముందస్తుగా అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా ఉండేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు.
- శాటిలైట్‌తో నిరంతరం సమాచారం..
అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసు కుంటే వెంటనే సమాచారం అందించేందుకు అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఫైర్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శాటిలైట్ ద్వారా వచ్చే సమాచా రాన్ని తక్షణమే అటవీ అధికారులకు సమాచారాన్ని చేరవేస్తోంది. జిల్లాలో ఎక్కడైనా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లయితే ఆ ప్రాంతానికి తక్షణ మే సమాచారం అందించే వీలుం టుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసకువస్తారు. కంట్రోల్ రూం వేసవిలో 24గంటలు అందుబాటు లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కంట్రోల్ రూంకు తక్షణమే సమాచారం అందేలా ఏర్పాటు చేశారు.
ముందస్తు చర్యలు చేపడుతున్నాం..
- ముసవీర్, రేంజ్ అధికారి, బెజ్జూరు
అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగకుం డా ఉండేందుకు ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. అటవీ ప్రాంతంలో ఇప్పటికే ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశాం. అటవీ ప్రాంత గ్రామాల్లో అడవు ల్లో నిప్పు అంటకుండా ఉండేందుకు ప్రజల కు అవగాహన కల్పిస్తున్నాం. అటవీ ప్రాంతాలకు వెళ్లే కాపరులకు బీడీలు, చుట్ట అంటించకుండా ఉండేం దుకు సూచనలు చేస్తున్నాం.