Share News

నిర్మాణంలో ఉన్న హైరైస్‌ భవనంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - May 19 , 2026 | 05:36 AM

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న ఓ హైరైస్‌ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ‘ఐరిస్‌ రాఘవ’ పేరుతో ...

నిర్మాణంలో ఉన్న హైరైస్‌ భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న ఓ హైరైస్‌ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ‘ఐరిస్‌ రాఘవ’ పేరుతో నిర్మిస్తున్న ఈ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు అంటుకుని పైఅంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప నివాసితులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. వ్యర్థ పదార్థాలకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Updated Date - May 19 , 2026 | 05:36 AM