Share News

kumaram bheem asifabad- ఆర్థిక చేయూత

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:20 PM

గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 23,977.65 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది

kumaram bheem asifabad- ఆర్థిక చేయూత
లోగో

- 2026-27 ఆర్థిక సంవత్సరానికి రుణ లక్ష్యం ఖరారు

-రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 23,977.65 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు అదనంగా స్రీనిధి రుణాలు రూ. 123 కోట్ల రుణాలు మంజూరు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాల కు బ్యాంకు లింకేజీ రుణాలను ప్రభుత్వం ఏటా అందిస్తోంది.

- జిల్లాలో 8,163 సంఘాలు:

జిల్లాలో 8,633 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో ఆర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. అయా గ్రూపు సభ్యులు చేపట్టే వ్యాపారం మేరకు రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. చాలామంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్‌, వ్యవసాయ రంగానికి సంబందించిన వ్యాపారాలు చేసుకొవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాల రికవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగానే రుణాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహి ళలు వ్యక్తిగతంగా రూ. ఐదు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు బృందం సభ్యులు పూచికత్తుగా ఉంటారు.

- ప్రతీ నెల వడ్డీ చెల్లిస్తే..

మహిళా సంఘాలకు మంజూరు చేసిన రుణాల వడ్డీని ప్రభుత్వం ప్రతీనెల విధిగా చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. గతేడాది వడ్డీ బకాయిలు ఇంకా పెండిం గ్‌లో ఉన్నాయి. వడ్డీ డబ్బులు ప్రతీ నెల చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

మండలాల వారీగా రుణ లక్ష్యం:

మండలం సంఘాలు రుణ లక్ష్యం

(రూ.లక్షల్లో)

ఆసిఫాబాద్‌ 682 2,092.84

బెజ్జూరు 467 1,521.68

చింతలమానేపల్లి 517 1,479.00

దహెగాం 535 1,639.10

జైనూరు 575 1,822.35

కెరమెరి 556 1,531.16

కాగజ్‌నగర్‌ 900 2,746.46

కౌటాల 622 1,812.53

లింగాపూర్‌ 279 937.60

పెంచికల్‌పేట 267 809.80

రెబ్బెన 690 1,893.00

సిర్పూర్‌(టి) 507 1,384.80

సిర్పూర్‌(యూ) 312 841.63

తిర్యాణి 511 1,559.97

వాంకిడి 743 1,925.73

సద్వినియోగం చేసుకోవాలి..

- దత్తారావు, డీఆర్డీవో

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ది సాధిం చేందుకు ప్రభుత్వం ఏటా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది కూడా రుణ లక్ష్యం విధించి వందశాతం చేరుకునేలా దిశా నిర్థేశం చేశాం. రుణ లక్ష్యంతో వెనుకబడ్డ మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమాయత్తం చేస్తాం.

Updated Date - Jun 18 , 2026 | 10:20 PM