‘ఇందిరమ్మ’ బీమాతో ఆర్థిక భరోసా..
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:07 AM
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి పరేడ్ గ్రౌం డ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులచే
పెద్దపల్లి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి పరేడ్ గ్రౌం డ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని, సంక్షేమం, అభి వృద్ధి, సామాజిక న్యాయంతో తెలంగాణను దేశంలోనే అగ్ర గామిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా రక్షణ కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువజనాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం..
ప్రీ-పైమ్రరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నూతనంగా అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించామని, జిల్లాలోని 547 పాఠశాలల ద్వారా సుమారు 37 వేల మంది విద్యార్థులకు విద్య అందుతోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.17 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని, రూ.66 లక్షలతో భవిత కేంద్రాలను అభివృద్ధి చేశామని, పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన 16 పాఠశాలలను ఆధునికీ కరిస్తున్నామని తెలిపారు. అభయహస్తం కార్యక్రమం కింద జిల్లాలో 9,823 కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు 8,978 మంది కొత్త సభ్యులను పాత కార్డుల్లో చేర్చా మని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,953 మంది లబ్ధిదారులకు 4,73,691 గ్యాస్ సిలిండర్లను రూ. 14.03 కోట్ల సబ్సిడీతో రూ.500కే అందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో మహిళలు రూ. 193.35 కోట్ల మేర ఆదా చేసుకున్నారని చెప్పారు.
ఫ వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో మంజూరు చేసిన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.126 కోట్లు జమ చేశామని తెలిపారు. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియో జకవర్గానికి 2వేల చొప్పున ప్రభుత్వం ఇళ్లు కేటాయించిం దన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వి ద్యుత్ వినియోగిస్తున్న 1,39,760 కుటుంబాలకు రూ.135.92 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహిళా శక్తి మిషన్ కింద జిల్లాలోని 6,842 స్వ యం సహాయక సంఘాలకు రూ.454.66 కోట్ల బ్యాంక్ లిం కేజ్ రుణాలు, 1,642 సంఘాలకు రూ.52.90 కోట్ల స్త్రీనిధి రుణాలు అందించామని చెప్పారు.
8909 సంఘాలకు రూ. 18.03 కోట్ల వడ్డీ రాయితీ విడు దల చేశామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 15 అద్దె ఆర్టీసీ బస్సులు, ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఆర్థిక సం వత్సరంలో 5,668 మహిళా ఎంటర్ ప్రైజ్‌లు స్థాపించామని పేర్కొన్నారు. రంగంపల్లి వీ-హబ్ కేంద్రం ద్వారా 376 మందికి శిక్షణ అందించామని తెలిపారు.
ఫ యాసంగిలో రూ.767.09 కోట్ల ధాన్యం కొనుగోలు..
2025-26 యాసంగి సీజన్‌లో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.767.09 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వ్యవ సాయ యాంత్రీకరణ పథకం కింద 456 మంది రైతులకు రూ.1.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామని తెలిపారు. రైతుభరోసా కింద 1,54,598 మంది రైతులకు రూ.114.04 కోట్ల నిధులు జమ చేశామని చెప్పా రు. 50 శాతం సబ్సిడీపై 6,900 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశామని తెలిపారు. రైతుబీమా కింద గత రెండు సంవత్సరాల్లో మరణించిన 1,002 మంది రైతు కుటుంబాలకు రూ.44.85 కోట్ల పరిహారం అందించామని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం కింద రూ.18.21 కోట్ల వ్యయంతో 30,659 కుటుంబాలకు ఉపాధి కల్పించామ న్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 93,659 మంది లబ్ధి దారులకు రూ.252.22 కోట్ల చేయూత పింఛన్లు అందించా మని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా 3,472 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ చేపట్టి రూ.1.78 కోట్ల సబ్సిడీ అందించామని, సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 1,162 ఎకరాలకు రూ.3.19 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
మత్స్య శాఖ ద్వారా 26,051 హెక్టార్లలో కోటి 58 లక్షల చేప పిల్లల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలి పారు. ప్రమాదాల్లో మరణించిన 23 మత్స్యకార కుటుంబా లకు రూ.1.15 కోట్ల పరిహారం అందించామని చెప్పారు.
ఫ 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్..
విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలోని 74,157 వ్యవసాయ కనెక్షన్లకు రూ.382.65 కోట్ల సబ్సిడీతో 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద 9.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 1,094 సోలార్ రూఫ్‌టాప్‌లను 7,297 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 9 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నందిమేడారం గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తూ రూ.51.28 కోట్లతో 1,486 గృహాలు, 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో రూ.39 కోట్ల 11 లక్షల వ్యయంతో 14,983 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిం చగా, తెలంగాణ హబ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా 95,624 మంది నుంచి 1,72,159 శాంపిల్స్ సేకరించి 3,39,906 పరీక్షలు ఉచితంగా నిర్వహించామని, 108 అంబులెన్స్ ద్వారా 13,937 మందికి, 102 సేవల ద్వారా 16,924 మంది గర్భిణులు, చిన్నారులకు రవాణా సౌకర్యం కల్పించారు. రామగుండం క్రిటికల్ కేర్ భవనం, మేడారం సీహెచ్‌సీలను ప్రారంభిం చగా, రూ.51 కోట్లతో జిల్లా ఆసుపత్రి, రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే రూ.160.30 కోట్లతో రామగుండం ఆసు పత్రి భవనం, రూ.104.81 కోట్లతో కోర్టు, ఇతర భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఫ కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి..
రోడ్లు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో 102.06 కిలోమీటర్ల మేర 22 డబుల్ రోడ్డు విస్తరణకు రూ.921.93 కోట్లు మం జూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. రూ.497.03 కోట్లతో 17 వంతెనల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టగా, 9 పూర్తయ్యాయని, వరదలతో దెబ్బతిన్న రహదారులను రూ.31.81 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టి 16 పనులు పూర్తి చేశామని అన్నారు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మార్గంలో రూ.119 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు 75 శాతం పూర్తయ్యాయని, పట్టణాభి వృద్ధి రంగంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా మౌలిక సదు పాయాల విస్తరణ చేపడుతోందని, అమృత్ 2.0 పథకం కింద జిల్లాలో రూ.289.46 కోట్లతో ఎస్‌టీపీలు, సీవర్ ట్రంక్ మెయిన్‌ల, యూఐడీఎఫ్ నిధుల ద్వారా రూ.226 కోట్లతో మంచినీటి సరఫరా, రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని తెలి పారు. డీఎంఎఫ్‌టీ నిధులు రూ.16.59 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, భూగర్భ మురుగు కాలువలు, మంచినీటి పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయన్నారు..
ఫ మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యం..
మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 706 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3,710 మంది గర్భిణీలు, 2,930 మంది బాలిం తలు, 33,441 మంది చిన్నారులకు పోషకాహారం అంది స్తున్నామని తెలిపారు. 153 మంది దివ్యాంగులకు పరిక రాలు, 21 మందికి స్వయం ఉపాధి రుణాలు, 9 దివ్యాంగ జంటలకు వివాహ ప్రోత్సాహకాలు అందించామని పేర్కొ న్నారు. యువజన, క్రీడా రంగంలో రూ.2.5 కోట్లతో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, రూ.1.5 కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో 266 మందికి ఉపాధి కల్పించే 22 పరిశ్రమలకు రూ.11.24 కోట్ల పెట్టుబడులతో టీజీ-ఐపాస్ అనుమతులు మంజూరు చేశామని, పీఎంఈజీపీ కింద 29 యూనిట్లు, టీ-ఐడియా, టీ- ప్రైడ్ ద్వారా 42 పరిశ్రమలకు రూ.7.67 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 3,515 మంది యువత పాల్గొనగా 933 మందికి ఉద్యోగావకాశాలు లభిం చాయని తెలిపారు. అగ్నివీర్ శిక్షణ ద్వారా 47 మంది ఎంపి కైనట్లు చెప్పారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, డీఆర్‌ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, నూగిళ్ల మల్లయ్య, ఆర్డీఓ బి గంగయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.