Share News

kumaram bheem asifabad- ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:34 PM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం ద్వారా అర్హతగల ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించనున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంబించారు

kumaram bheem asifabad-  ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిత, నాయకులు

ఆసిఫాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం ద్వారా అర్హతగల ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించనున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి వర్తించే విధంగా రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో 1,65,000 వేల రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలకు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలలో 411 ప్రదేశాలలో శిబిరాలు నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి నుంచి భీమా దరఖాస్తులు స్వీకరించి వివరాలను నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్‌కార్డులు లేని వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటా మన్నారు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఎలాంటి ఽద్రువపత్రాలు అవసరం లేకుండా కేవలం రేషన్‌కార్డు నంబరు ఉంటే కుటుంబ సభ్యుల సమ్మతితో కుటుంబంలోగల 18 నుంచి 59 వయస్సుగల వారిలో ఒకరికి భీమా చేయించుకొని నామినీ వివరాలను దరఖాస్తులో నింపితే సరిపోతుందని తెలిపారు. జిల్లాలో ఈ పథకంపై ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నినదించిన గరీబీ హటవో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా అందించాలనే ఆలోచనతో ఈ పథకం ప్రారంభించిందని చెప్పారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం ప్రతీ అర్హత కలిగిన కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. సమావేశంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్లు ఆకాష్‌, షాహిన్‌ సుల్తానా, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 10:34 PM