kumaram bheem asifabad- పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:27 PM
గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) సవరణకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభిం చింది
- వేగం కానున్న అభివృద్ధి పనులు
కెరమెరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) సవరణకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభిం చింది. ఈ నిర్ణయంతో కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వసూలు చేసే సొంత ఆదాయం ప్రభుత్వ ట్రేజరీ ద్వారా వినియోగానికి వెళ్లాల్సి వస్తుం డగా, కొత్త సవరణతో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఆదాయం నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది. దీనికి సంబంధించిన ఆర్డినేన్స్‌ను ప్రభుత్వం త్వరలోనే జారీ చేసే అవకాశం ఉంది.
- ఇంటి పన్నులు..
ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణం అనుమతుల రుసుములు, మార్కెట్ ఫీజులు, ఇతర స్థానిక ఆదాయం వనరుల ద్వారా వచ్చే నిధులను గ్రామ పంచాయతీ నేరుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీంతో తాగునీటి సరఫరా, పారిశుద్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, చిన్నపాటి మౌలిక సదుపాయాలు పనులు, అత్యవసర అవసరాలకు ఆలాస్యం లేకుండా చేపట్టవచ్చు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధిక భాగం ఏజేన్సీ ప్రాంతం కావటంతో చిన్న చిన్న అభివృద్ధి పనులకే నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త విధానం అమల్లోకి వస్తే స్థానికంగా సమకూరే ఆదాయాన్ని గ్రామ అవసరాలకే వెంటనే వినియోగించుకునే వీలు కలగనుంది. దీంతో గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు ఇక వేగంగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త సవరణతో గ్రామ పంచాయతీల ఆర్థిక స్వాతంత్య్రం పెరుగటంతో పాటు స్థానిక పాలన మరింత బలోపేతం కానుంది. గ్రామాల్లో కూడా జవాబుదారీతనం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉండవు..
- కె.తులసిరాం, సావర్‌ఖేడ సర్పంచ్
కొత్త నిబంధనలు అమలు జరిగితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉండవు. వివిధ పన్నుల రూపేణ వసూలు చేసిన డబ్బులు మొత్తం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కార్మికుల జీత భత్యాలు, ఇతరాత్ర ఖర్చులకు పెట్టుకోవచ్చు. దీంతో నిధుల కోసం వేచి చూడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.67కెజి22
66కెజిపి22: కె.తులసిరాం, సర్పంచ్ సావర్‌ఖేడ
పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ
- సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే..
- వేగం కానున్న అభివృద్ధి పనులు
కెరమెరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) సవరణకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వసూలు చేసే సొంత ఆదాయం ప్రభుత్వ ట్రేజరీ ద్వారా వినియోగానికి వెళ్లాల్సి వస్తుం డగా, కొత్త సవరణతో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఆదాయం నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది. దీనికి సంబంధించిన ఆర్డినేన్స్‌ను ప్రభుత్వం త్వరలోనే జారీ చేసే అవకాశం ఉంది.
- ఇంటి పన్నులు..
ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణం అనుమతుల రుసుములు, మార్కెట్ ఫీజులు, ఇతర స్థానిక ఆదాయం వనరుల ద్వారా వచ్చే నిధులను గ్రామ పంచాయతీ నేరుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీంతో తాగునీటి సరఫరా, పారిశుద్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, చిన్నపాటి మౌలిక సదుపాయాలు పనులు, అత్యవసర అవసరాలకు ఆలాస్యం లేకుండా చేపట్టవచ్చు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధిక భాగం ఏజేన్సీ ప్రాంతం కావటంతో చిన్న చిన్న అభివృద్ధి పనులకే నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త విధానం అమల్లోకి వస్తే స్థానికంగా సమకూరే ఆదాయాన్ని గ్రామ అవసరాలకే వెంటనే వినియోగించుకునే వీలు కలగనుంది. దీంతో గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు ఇక వేగంగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త సవరణతో గ్రామ పంచాయతీల ఆర్థిక స్వాతంత్య్రం పెరుగటంతో పాటు స్థానిక పాలన మరింత బలోపేతం కానుంది. గ్రామాల్లో కూడా జవాబుదారీతనం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉండవు..
- కె.తులసిరాం, సావర్‌ఖేడ సర్పంచ్
కొత్త నిబంధనలు అమలు జరిగితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉండవు. వివిధ పన్నుల రూపేణ వసూలు చేసిన డబ్బులు మొత్తం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కార్మికుల జీత భత్యాలు, ఇతరాత్ర ఖర్చులకు పెట్టుకోవచ్చు. దీంతో నిధుల కోసం వేచి చూడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.