Share News

kumaram bheem asifabad- పీఎం రాహత్‌ పథకం కింద ఆర్థిక సాయం

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:55 PM

రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి ప్రదానమంత్రి రహత్‌ పథకం ద్వారా చికిత్సకు ఆర్థిక సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పీఎం రాహత్‌ పథకం కింద ఆర్థిక సాయం
:వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి ప్రదానమంత్రి రహత్‌ పథకం ద్వారా చికిత్సకు ఆర్థిక సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ప్రదానమంత్రి రహత్‌ పథకం కింద రూ. 1.50 లక్షలోపు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. గాయపడిన వారు 24 గంటలలోపు తీవ్రంగా గాయపడిన వారు 48 గంటలలోపు ఈదార్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకంపై గ్రామాలలో పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎంహెచ్‌వో నాగేంద్ర సిడాం ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, భూ కొలతల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడస్ట్రాల్‌ మ్యాప్‌లు లేని గ్రామాలలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించా లన్నారు. రైతులకు ముందుగానే సమాచారం అందించాలని అటవీ హక్కులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఏడీ వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 10:55 PM