Share News

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:48 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందజేసి పరామర్శిస్తున్న రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి

కల్వకుర్తి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కల్వకుర్తి మండలంలోని వేపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కల్వకుర్తి పట్ట ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని మాజీ వైస్‌ ఎంపీపీ గోవర్ధ న్‌ ద్వారా తెలుసుకున్న గోలి శ్రీనివాస్‌ రెడ్డి హైద్రాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శంకర్‌తోపాటు ఆయన కుమార్తె భూమిక కుమారుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీలు గోవర్ధన్‌, అనిల్‌కుమార్‌, నాయ కులు గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:48 PM