డీజీపీ సెలక్షన్ ఫైనల్ లిస్టు ప్రభుత్వం వద్దకు!
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:02 AM
పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి ముగ్గురి పేర్లతో కూడిన జాబితా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని సమాచారం
సీవీ ఆనంద్, వీపీ ఆప్టే, సౌమ్యామిశ్రా పేర్లు
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!? ప్రభుత్వ సలహాదారుగా శివధర్‌రెడ్డి?
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి ముగ్గురి పేర్లతో కూడిన జాబితా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని సమాచారం. తుది జాబితాలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు వీపీ ఆప్టే, సౌమ్యా మిశ్రాల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమించనున్నారని సమాచారం. అదే సమయంలో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చేనెల 30న రిటైర్ అవుతున్న క్రమంలో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించనున్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.