Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ అబద్దపు హామీలపై పోరాటం

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:09 PM

కాంగ్రెస్‌ అబద్దపు హామీలపై పోరాటం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వేయిరోజుల పాలనపై జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు.

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ అబద్దపు హామీలపై పోరాటం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అబద్దపు హామీలపై పోరాటం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వేయిరోజుల పాలనపై జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో అభివృద్ధి పనులు జరుగడం లేదన్నారు. మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారే తప్ప పనులు ముందుకు సాగడంలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హాయాంలోనే ఆసిఫాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గంలో వంతెనలు, బీటీరోడ్లు, మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మోసపూరిత హామీలను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం నుంచి సెప్టెంబరు 8 వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఆలీబీన్‌అహ్మద్‌, శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ చిలువేరి వెంకన్న, పార్టీ మండల అధ్యక్షులు రవిందర్‌, నాయకులు సరస్వతి, కలాం, అజయ్‌, అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:09 PM