Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:26 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలం భిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వా మపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ని రసన చేపట్టారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
కొల్లాపూర్‌లో రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

- వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు

- జైల్‌భరోలో భాగంగా నిరసనలు

కొల్లాపూర్‌/ అచ్చంపేట టౌన్‌/ కల్వకుర్తి, ఆగ స్టు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలం భిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వా మపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ని రసన చేపట్టారు. కొల్లాపూర్‌ పట్టణంలోని ఎన్టీఆ ర్‌ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రా స్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ కేంద్రంలో మో దీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యుల పొట్టకొట్టి కార్పొరేట్‌ సం స్థలకు పెద్దపీట వేస్తున్నదని దుయ్యబట్టారు. కా ర్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్‌ కోడ్‌లను వెం టనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. అమెరి కాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని విదేశీ దిగు మతులను స్వేచ్ఛగా అనుమతించడం వల్ల దేశీ య రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యల కు పాల్పడుతోందని ఆం దోళన వ్యక్తం చేశారు. రా స్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్‌ కార్యదర్శి శివవ ర్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి సలీం, ప్రజా సం ఘాల నాయకులు సీ ఐటీయూ, యూటీఎఫ్‌ ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:26 PM