హోరాహోరీగా పాలపండ్ల విభాగ పోటీలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:30 AM
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో శ్రీకోదండ రామస్వామి 42వ వార్షికోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు గిత్తల పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.
మఠంపల్లి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో శ్రీకోదండ రామస్వామి 42వ వార్షికోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు గిత్తల పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన పాలపండ్ల విభాగంలోనల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు చెందిన 10 జతలు గిత్తలు పోటీల్లో పాల్గొన్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగుతున్న పోటీలను తిలకించేందుకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. మూడు రోజులుగా రఘునాథపాలెంలో ఎడ్లపందెలతో పండుగ వాతవరణం నెలకొంది. దూర ప్రాంతాల నుంచి పోటీలకు వచ్చే వారికి నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాలపండ్ల విభాగంలో గెలుపొందిన గిత్తల జతల విజేతలకు నిర్వాహకులు దాతల ఆధ్వర్యంలో 1నుంచి 8వరకు వరుసగా రూ.20వేలు, రూ.18వేలు, రూ.15వేలు, రూ.12వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.6వేలు, రూ.5వేలు నగదు, ప్రోత్సహక బహుమతులను అందజేశామని తెలిపారు.