పుష్కరాలకు రూ.1,000 కోట్ల వ్యయంపై సీఎం పునరాలోచించాలి: ఎఫ్జీజీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:08 AM
రాబోయే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.1000కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారీ మొత్తంలో వ్యయం చేసే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ సిటీ, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): రాబోయే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.1000కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారీ మొత్తంలో వ్యయం చేసే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి గురువారం లేఖ రాశారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని, తాగునీరు, వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి అత్యవసర పనులకే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.