Share News

పండగపూట కారంతో భోజనం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:38 PM

ఎన్‌ హెచ్‌ఎం ఉద్యోగులనిర వధిక సమ్మె బుధవారా నికి తొమ్మిదో రోజుకు చే రుకుంది. దసరా పండుగ రెండు రోజుల్లోనూ ఉద్యోగులు తన నిరసన కొనసాగించారు.

పండగపూట కారంతో భోజనం
జిల్లా కేంద్రంలో దుర్గామాత విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

- కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

నాగర్‌కర్నూల్‌ టౌ న్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ హెచ్‌ఎం ఉద్యోగులనిర వధిక సమ్మె బుధవారా నికి తొమ్మిదో రోజుకు చే రుకుంది. దసరా పండుగ రెండు రోజుల్లోనూ ఉద్యోగులు తన నిరసన కొనసాగించారు. ద సరా రోజున దుర్గామాతను దర్శించుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రార్ధించారు. అ దేవిధంగా బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. కారంతో భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగు లను షరతుల్లేకుండా క్రమబద్ధీకరించాలని, స మాన పనికి సమాన వేతనం అమలు చేయా లని జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని దీక్షలోని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

Updated Date - Oct 21 , 2026 | 11:38 PM