Share News

ఫెర్టిలైజర్‌ యాప్‌తో విప్లవాత్మక మార్పు: తుమ్మల

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:55 AM

రాష్ట్ర వ్యవసాయశాఖ అమల్లోకి తెచ్చిన ‘ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు..

ఫెర్టిలైజర్‌ యాప్‌తో విప్లవాత్మక మార్పు: తుమ్మల

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయశాఖ అమల్లోకి తెచ్చిన ‘ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో రైతాంగానికి ఇది ఉపయుక్తంగా ఉందని యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేకుండా చేసిందన్నారు. వ్యవసాయ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని.. కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందని పేర్కొంటూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్‌లోని రియల్‌ టైమ్‌ స్టాక్‌ విజిబిలిటీ, రైతు వారీ డిజిటల్‌ బుకింగ్‌, పంటల ఆధారిత ఎరువుల సరఫరా వ్యవస్థ లాంటి అంశాలను.. కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్‌ వ్యవసాయ పరిపాలనకు శ్రీకారం చుట్టిందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల ముసుగులో రాజకీయ ప్రేరేపిత ఆందోళనలకు ఈ యూరియా యాప్‌ చెక్‌ పెట్టిందని తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 04:55 AM