Share News

kumaram bheem asifabad- సింగపూర్‌ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడికి సన్మానం

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:12 PM

విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించి ఉత్తమ పద్ధతులను అమలు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు గాను సింగపూర్‌ పర్యటననకు ఎంపికైన వాంకిడి మండల కేంద్రానికి చెందిన జనకాపూర్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేశ్‌ను ఆదివారం మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ బండె తుకారాం సన్మానించారు

kumaram bheem asifabad- సింగపూర్‌ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడికి సన్మానం
ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న మాజీ జడ్పీటీసీ, నాయకులు

వాంకిడి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించి ఉత్తమ పద్ధతులను అమలు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు గాను సింగపూర్‌ పర్యటననకు ఎంపికైన వాంకిడి మండల కేంద్రానికి చెందిన జనకాపూర్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేశ్‌ను ఆదివారం మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ బండె తుకారాం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి చేపట్టిన ఉపాధ్యాయ ఎక్స్పోజర్‌ విజిట్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాంలో భాగంగా సింగపూర్‌ పర్యటనకు వడ్లూరి రాజేశ్‌ ఎంపిక కావడం అభినందనీయమన్నారు. జనకాపూర్‌ ఉన్నత పాఠశాలలో రూ. 50వేల తన సొంత డబ్బులతో జీవశాస్త్రం ల్యాబ్‌ ఏర్పాటు చేసి విద్యార్థులను రాష్ట్ర, జాతీయ పోటీలకు తీసుకువెళ్లడం సెలవుల్లో కూడా అంకితభావంతో పని చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవడం మండలానికి గర్వకారణమని కొనియాడారు. ఉపాధ్యాయులు వడ్లూరి రాజేశ్‌ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని వారు కోరారు.

Updated Date - Aug 23 , 2026 | 10:12 PM