ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:34 PM
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థులకు పెండింగ్‌లో ఉ న్న ఫీజు రీయింబర్స్‌మెం ట్, స్కాలర్‌షిప్ బకాయి లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ జిల్లా కన్వీ నర్ శంతన్ డిమాండ్ చేశారు.
- ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శంతన్ డిమాండ్
నాగర్‌కర్నూల్ టౌన్/ కల్వకుర్తి/ వెల్దండ, జూ లై 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థులకు పెండింగ్‌లో ఉ న్న ఫీజు రీయింబర్స్‌మెం ట్, స్కాలర్‌షిప్ బకాయి లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ జిల్లా కన్వీ నర్ శంతన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పి లుపులో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మం గళవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు క ళాశాలలు బంద్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాల ఎదుట శ్రీపురం చౌర స్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.11వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చిన హామీ లను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు, నగర కార్యదర్శి ప్రసాద్‌కు మార్, సంయుక్త కార్యదర్శి శివపాల్గొన్నారు.
ఫ కల్వకుర్తిలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన కళాశా లల బంద్ విజయవంతమైంది. నాయకులు శివరాం, చరణ్, భరద్వాజ్, నరసింహ, ప్రణీత్, శివ, రవీందర్, శ్రీశైలం, రాకేష్ పాల్గొన్నారు.
ఫ వెల్దండలో ఏబీవీపీ మండల కన్వీనర్ రేణికుంట్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతమైంది. వినతిపత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్‌రావుకు అందించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రేణికుంట్ల శ్రీకాంత్, కోకన్వీనర్ శివచరణ్, హరీష్, చరణ్, సిద్దార్ద్, దినేష్, మణికంఠ, అభిలాష్, చరణ్‌చారి, శివ, శ్రీకాంత్, జశ్వంత్ ఉన్నారు.