Share News

ముంపు భయం...!

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:14 PM

మంచిర్యాల నగరాన్ని వరద ముంపు భయం వీడటం లేదు. ఏటా వర్షాకాలంలో ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతుం డగా, పాత జ్ఞాపకాలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ముంపు భయం...!

-పాత జ్ఞాపకాలతో ప్రజల ఆందోళన

-రాళ్లవాగు బ్యాక్‌ వాటర్‌తో గండం

-వర్షాకాలంలో పునరావృతం అవుతున్న సంఘటన

-జిల్లా కేంధ్రంలో ఏటా మునుగుతున్న కాలనీలు

మంచిర్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరాన్ని వరద ముంపు భయం వీడటం లేదు. ఏటా వర్షాకాలంలో ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతుం డగా, పాత జ్ఞాపకాలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరద ముంపు నివారణకు రాళ్లవాగు వెంట కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం అవసరమైన ని ధులు విడుదల చేయగా, గ్రీన్‌ సిటీ కాలనీ వద్ద పను లు సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఉన్న ఫలంగా కరకట్ట నిర్మాణం పూర్తి చేయడం అసాధ్యం కావడంతో ఈ ఏడాదీ ముంపు బాధలు తప్పేలా లేవు. వర్షాకాలం లో ప్రతిసారీ రాళ్లవాగు ఉప్పొంగి ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నీ టిపారుదలశాఖ అధికారులు వాగుకు ఇరువైపులా క రకట్టల నిర్మాణానికి అంచనా వ్యయంతో కూడిన ప్రతి పాదనలను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అందజేసి నప్పటికీ, వరద రక్షణ గోడల నిర్మాణానికి పెద్ద మొ త్తంలో నిధులు, భూ సేకరణ అవసరం అవుతుండగా తలకు మించిన భారంగా భావించిన కేసీఆర్‌ ప్రభు త్వం ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టింది.

మూడు సంవత్సరాలుగా....

వరుసగా మూడు సంవత్సరాలుగా జూలైలో కురిసి న భారీ వర్షాల కారణంగా జిల్లా కేంధ్రంలో జనజీవనం అతలాకుతలం అవుతోంది. 2022 జూలై 13న కుండపో తగా వర్షం కురవడంతో జిల్లా కేంధ్రంలోని వాగులు పొంగి పొర్లి గోదావరి ఉప్పొంగింది. ఈ కారణంగా వా గుల్లో నీరు ఎదురెక్కి నివాస గృహాల్లోకి చేరింది. అర్థ రాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో ప్రజలు తేరు కొనేలోపే కాలనీలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా ఏడెనిమిది కాలనీలు 48 గంటల పాటు నీ టిలోనే మగ్గాయి. తిరిగి మరుసటి సంవత్సరం జూలై లో కురిసిన వర్షాలకు మళ్లీ ఆయా కాలనీలు నీట ము నిగాయి. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి పునరావృ తం అయింది. దీంతో ముందస్తుగా ప్రజలు ఇళ్లను ఖా ళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది.

రాళ్లవాగులో మునిగిన కాలనీలు.....

మూడు సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహి స్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిలో చేరే అవకాశం లే క రాళ్ల వాగు, తోళ్లవాగుల్లో వరదనీరు ఎక్కడికక్కడే ని లిచిపోయి, పోటు కమ్మాయి. జిల్లా కేంద్రంలోని రాళ్లవా గు బ్యాక్‌ వాటర్‌ కారణంగా పాత మంచిర్యాల, రెడ్డి కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, బైపా స్‌ రోడ్డు, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో పెద్ద మొత్తంలో ఇళ్లు మొ దటి అంతస్థు వరకు నీట మునిగాయి. అలాగే తోళ్లవా గు నీరు కూడా నివాస గృహాల దరిదాపుల్లోకి చేరింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు 2023ఆగస్టు 22, 23 తేదీలలో సర్వే జరిపి నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో పుట్టిన రాళ్లవాగు అటవీ ప్రాంతం గుండా ప్రవహించి జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. స్థానిక ఆర్‌ఆర్‌ నగర్‌, కార్మె ల్‌ హైస్కూల్‌, గౌతమీనగర్‌, రెడ్డి కాలనీ, పాత మంచి ర్యాల, రాంనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీల మీదుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. 2022 జూలైలో కురిసిన వర్షా ల కారణంగా రాళ్లవాగులో 139.20 మీటర్ల ఎత్తున నీ రు ప్రవహించినట్లు అధికారులు గుర్తించారు. పాత మంచిర్యాల వంతెన వద్ద 48006.35 క్యూసెక్కుల నీరు వాగు గుండా ప్రవహించినట్లు నిర్దారణకు వచ్చారు. అలాగే తోళ్లవాగుకు పై ఉన్న చింతల చెరువు నుంచి వరద తాకిడి పెరగడంతో నివాస గృహాల్లోకి నీరు చేరింది.

రూ. 234.86 కోట్ల అంచనా వ్యయంతో....

మంచిర్యాల నగరంలోని రాళ్లవాగుకు కరకట్టల ని ర్మాణం చేపట్టడం ద్వారా వరదను నివారించడానికి ప ట్టణంలోని కార్మెల్‌ స్కూల్‌ బ్రిడ్జి నుంచి 7.2 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించాలని, అ లాగే గోదావరి నది ఎడమవైపు ఒడ్డున రాళ్లవాగు క లిచే చోట 2 కిలోమీటర్ల పొడవున కూడా కరకట్ట ని ర్మాణం చేపట్టవలసి ఉండగా, ఆ మేరకు నివేదిక త యారు చేశారు. ఇందు కోసం ప్రస్తుతం ఉన్న రేట్ల ప్ర కారం సుమారు రూ. 234 కోట్ల 86 లక్షల 33 వేలు ఖ ర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందు లో కరకట్టల నిర్మాణానికి అవసరమైన పట్టా భూముల సేకరణకు సుమారు రూ. 200 కోట్ల 86 లక్షలు వెచ్చిం చాల్సి రాగా, నిర్మాణానికి రూ. 20 కోట్ల 21 లక్షల 31 వేలు, సీఓటీ ఎక్సవేషన్‌, పూడిక ఖర్చు రూ. 2 కోట్ల 48 లక్షల 43 వేలు, కరకట్ట రివిట్‌మెంట్‌కు రూ. 5 కోట్ల 25 లక్షల 51 వేలు, జీఎస్టీ, సీనరేజ్‌ చార్జీలు, డీఎంఎఫ్టీ, ఎస్‌ఎంఎఫ్‌, తదితరాలకు రూ. 6 కోట్ల 91 లక్షల 44 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదిలా ఉండ గా తోళ్లవాగులో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా కరకట్టలు ని ర్మించాల్సిన అవసరం లేకుండానే పరిస్థితిని చక్కదిద్దవ చ్చునని అధికారులు ప్రతిపాధించారు. అయితే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందనే ఉద్దేశ్యంతో కరకట్టల నిర్మా ణాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.

ఎమ్మెల్యే చొరవతో....

రాళ్లవాగు బ్యాక్‌ వాటర్‌ కారణంగా మంచిర్యాల నగ రం నీట మునుగుతుండటంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు కరకట్టల నిర్మాణం చేపట్టవలసిందిగా అసెంబ్లీ సాక్షిగా విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలనలోకి తీసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సంబంధిత అధికారుల నుంచి నివే దికను తెప్పించుకుంది. మొత్తంగా రూ. 250 కోట్లు అం చనా వ్యయం ఉండటంతో ఆ మేరకు నిధులు విడు దల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇం దులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైన బడ్జెట్‌ రూ. 250 కోట్లను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మ ల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. దీంతో కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం కాగా, పనులు ప్రారంభ మయ్యాయి. వచ్చే ఏడాది వర్షాకాలంలోపు కరకట్ట ని ర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నా రు. ఈ ఏడాది ముంపునకు అవకాశం ఉండగా, పాత జ్ఞాపకాలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:14 PM