Share News

kumaram bheem asifabad- భయం..భయం

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:25 PM

మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాల యం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ఉపాధ్యాయులు, అధికారులు భయాందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- భయం..భయం
లోగో

- ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి

- సమావేశాలకు తప్పని ఇబ్బందులు

బెజ్జూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాల యం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ఉపాధ్యాయులు, అధికారులు భయాందోళన చెందుతున్నారు. కార్యాలయం లోపల పూర్తిగా పెచ్చులుడుతుండ డంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం కురిసినప్పుడల్లా వర్షపు నీరంతా ఊరుస్తుం డడంతో విధులకు ఆటంకం కలుగుతుంది. కాగా మండల విద్యా కార్యాలయం శిథిలావస్థకు చేరిన కారణంగా ప్రతి నెలా నిర్వహించే ఉపాధ్యాయ సమావేశాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఉపాధ్యాయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో సరైన వసతులు లేని కారణంగా సమావేశాలను ఇతర చోట్ల ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. దీంతో వారికి, తమకు ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. కార్యాలయంలో గోడలు దెబ్బ తినడంతో రిజిస్టర్లు, కంప్యూటర్లు పాడై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. లోపల సమావేశాలు నిర్వహించినట్లయితే భయాందోళనగా ఉందని, పాలకులు స్పందించి నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపించాం..

- సునీత, ఎంఈవో, బెజ్జూరు

మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం కోసం గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. భవనం పూర్తిగా శిథిలా వస్థకు చేరడంతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారిం ది. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవనానికి నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.

Updated Date - Aug 19 , 2026 | 11:25 PM