పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల సందడి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:19 AM
పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ వస్తాలు అద్భుతంగా ఉన్నాయని ఒడిశా రాష్ట్రం బరంపూర్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు అన్నారు.
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ వస్తాలు అద్భుతంగా ఉన్నాయని ఒడిశా రాష్ట్రం బరంపూర్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు అన్నారు. క్షేత్రపర్యటనలో భాగంగా వారు యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని బుధవారం సందర్శించారు. పర్యాటక కేంద్రంలోని మ్యూజియం సందర్శించి లీవ్‌టు క్లాత్ ప్రాసెసింగ్ సెంటర్‌లో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలు వార్పు, డిజైనింగ్, గ్రాఫ్, టైయింగ్, డైయింగ్, రీలింగ్, మగ్గంపై వీవింగ్ తదితర విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. టూరిజం సెంటర్‌లోని లైవ్ వీవింగ్ యూనిట్‌ను పరిశీలించారు. పోచంపల్లి వస్త్రకళాకారులు రూపొందించిన అద్భుత డిజైన్లను చూసి అబ్బురపడ్డారు. కార్మికుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ అలితా మీన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అస్మిత వీవ్‌రా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.