kumaram bheem asifabad- సాగు లెక్క.. ఇక పక్కా
ABN , Publish Date - Sep 10 , 2026 | 10:39 PM
జిల్లాలో పత్తి, వరి, ఆరుతడి, కూరగాయలతో పాటు ఇతర పంటల సాగు లెక్క ఇక పక్కాగా నమోదు కానుంది. వ్యవసాయ ఉత్పత్తులు అధిక దిగుబడులు సాధిం చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇందుకోసం డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టి సాగు విస్తీర్ణం, పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. ఇదివ రకు ఏఈవోలు ఈ పనిని చేపట్టేవారు. అయితే ఇటీవల నియమితులైన వలంటీర్ల ద్వారా ఈ సర్వే చేపడుతున్నారు.
- కొనసాగుతున్న పంటల వివరాల నమోదు
- అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
వాంకిడి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి, వరి, ఆరుతడి, కూరగాయలతో పాటు ఇతర పంటల సాగు లెక్క ఇక పక్కాగా నమోదు కానుంది. వ్యవసాయ ఉత్పత్తులు అధిక దిగుబడులు సాధిం చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇందుకోసం డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టి సాగు విస్తీర్ణం, పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. ఇదివ రకు ఏఈవోలు ఈ పనిని చేపట్టేవారు. అయితే ఇటీవల నియమితులైన వలంటీర్ల ద్వారా ఈ సర్వే చేపడుతున్నారు. దీంతో వ్యవసాయ రంగం గణాంకాల స్వరూపం మారనుంది. పంటల విస్తీర్ణం, సాగు వివరాలు పక్కాగా తెలియనున్నాయి. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే వేగంగా సాగుతుది. ఇందుకోసం గ్రామాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నిచుద్యోగులనఉ క్రాప్ సర్వే కోసం వాలంటీర్లుగా నియమించారు. వారికి శిక్షణ పూర్తి చేసి వారి సెల్‌ఫోన్లలో యాప్‌ను అప్‌లోడ్ చేశారు. గ్రామాల్లో పర్యటింస్తూ రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. పోలాలలను గుర్తించి సర్వే నెంబర్ల ఆధారంగా ఆక్కడ ఏ రకం పంట సాగు చేశారో పరిశీలించి డిజిటల్ పద్దతిలో నమోదు చేస్తున్నారు. సర్వే నిర్వహించిన వావలంటీర్లకు రైతులు సహకరించి వారు సాగు చేసిన పంట వివరాలను తెలుపుతు న్నారు. సర్వే వివరాలను వలంటీర్లు సంబంధిత పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని సంబంధిత ఏఈవోలు పరిశీలించి అనంతరం డీఏవో లాగిన్‌కు పంపిస్తారు.
- వానాకాలంలో..
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు అన్నికరాల పంటలు కలిపి దాదాపు 4.52 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అందులో ప్రధానంగా 3,77,764 ఎకరాల్లో పత్తి, 35,452 ఎకరాల్లో వరి, 26,443 ఎకరాల్లో కంది 3,820 ఎకరాల్లో సోయా, 6,698 ఎకరాల్లో మొక్కజోన్న, 895 ఎకరాల్లో మిను ములు, 1.245 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసు ్తన్నారు. జిల్లాలోని 15 మండలాల్లోని 443 రెమెన్యూ గ్రామాల్లో డిజిటల్ క్రాఫ్ సర్వే చేపట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతులు సాగు చేసిన పంటల వివరాలు తెలియనున్నాయి. ఈ సర్వే ఆధారంగానే రైతులకు వ్యవసాయరంగానికి సంబంధించిన పథకాలను అమలు చేయనున్నారు. సన్న ధాన్యానికి బోనస్ అందించనున్నారు. అదేవిధంగా రైతు భరోసా తో పాటు పలు సంక్షేమ పథకాలను వర్తింపుచేయనున్నారు. దీంతో పాటు జిల్లాలో రైతు ఏపంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారో కూడా స్పష్టం కానుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. పంటల సాగు ఆధారంగానే ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, సాగునీరు, గిడ్డంగులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రయోజనాలు ఇలా..
- రైతు సాగు చేస్తున్న పంటకు అఽధికారిక నమోదు.
- కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు వివరాలు సులభం.
- పంట నష్టం జరిగిన సందర్భాల్లో పరిహారానికి అవకాశం.
- ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత సాగవుతుందో స్పష్టమైన సమాచారం.
- విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవల అవసరానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయడం.
- పంటల ఆధారంగా వ్యవసాయ విధానాలు, మార్కెట్ ప్రణాళిక రూపొందించేందుకు అవకాశం
క్రాప్ డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలి..
- మిలింద్, ఏడీఏ
క్రాప్ డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలి. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది.. రైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలను నమోదు చేస్తున్నాం. రైతు ఎన్ని ఎకరాల్లో ఏ రకం పంట లు సాగు చేశారో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వివరాలు సేకరిసు ్తన్నాం. డిజిటల్ క్రాప్ సర్వేతో పం టల సాగుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.