Share News

kumaram bheem asifabad- రైతుకు సాంకేతిక చేరితేనే సాగు లాభదాయకం

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:05 PM

రైతులు సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు అందించే సూచనలను అమలు చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సిర్పూరు(టి) రైతు వేదికలోలో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు

kumaram bheem asifabad- రైతుకు సాంకేతిక చేరితేనే సాగు లాభదాయకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

సిర్పూరు(టి), జూలై 28 (ఆంధ్రజ్యోతి): రైతులు సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు అందించే సూచనలను అమలు చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సిర్పూరు(టి) రైతు వేదికలోలో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు నివారణ, ప్రభుత్వ పథకాలపై రైతులకు ఉపయోగకరమైన సమాచారం అందుతుండడం అభినందనీయమన్నారు. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, నీటి పొదుపు పద్దతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి రైతుకు చేరేలా కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ఎలినో ప్రభావం వల్ల రైతులు ఆరుతడి పంటలు జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు తక్కువ కాలం పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం సిర్పూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె మొక్కలను నాటారు. కార్యక్రమంలో సిర్పూరు(టి) సర్పంచు నాగమణి, తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎంపీడీవో కె.ప్రసాద్‌, జిల్లా వ్యవసాయా శాఖ అధికారి వెంకట్‌, ఏడీఏ మనోహర్‌, ఏవో గిరీషం, ఏఈవో రవి కుమార్‌, శంకర్‌, విశాల్‌, ఉప సర్పంచ్‌ దుర్గం ప్రశాంత్‌తో పాటు మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కారణంగా లోటు వర్షపాతం ఉందని, భూ గర్భజల్లాలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సామాజిక ఇంకుడు గుంతలు, ఫారం ఫాండ్‌, నీటి కుంటలు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన జలసరి కింద విబిజిరాంజీ పథకం ద్వారా భూ గర్భ జల నీటి మట్టాన్ని పెంపొందించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి వర్షపు బొట్టును భూమిలో ఇంకించాలని తెలిపారు. ఈ దిశగా స్వయం సహాయక సంఘాల సభ్యులు భాగస్వామ్యులు కావాలని తెలిపారు. కరువు పరిస్థితులను ఎదుర్కొవాలంటే భూమి నీటి మట్టాన్ని పెంచటమే మార్గమని, వీబీజీరాంజీ పథకం ద్వారా అర్హులైన కూలీలకు 125 పని దినాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశలాల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 15వ తేదిలోగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం వనహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:05 PM