ధాన్యం కొనడం లేదంటూ రైతుల రాస్తారోకో
ABN , Publish Date - May 07 , 2026 | 11:37 PM
కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో 63వ జాతీయ రహదారిపై రైతు లు గురువారం రాస్తారోకో చేపట్టారు.
అధికారుల కాళ్లు మొక్కిన రైతులు
హాజీపూర్, మే 7 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో 63వ జాతీయ రహదారిపై రైతు లు గురువారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా అధికారులు తూకం వేయడం లేదని వాపోయారు. అధికారులు కూడా తమ బాధను పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చినా కానీ వడ్లు కొనడం లేదన్నారు. 1500 బస్తాలు తూకం వేసి ఉన్నాయని, మంగళవారం రాత్రి కురిసిన ర్షానికి తడిసిపోయాయని, ఆ బస్తాలను వెంటనే తరలించాలన్నారు. 40 కిలోల బస్తాకు 3 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, లారీ రావాలంటే బస్తాకు రూ. 2 అడుగుతున్నారని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ భీష్మీం చుకుకూర్చున్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న హాజీపూర్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ రైతు లకు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు
-అధికారుల కాళ్లు మొక్కిన రైతులు
ధాన్యం తూకం వేశారు కానీ వర్షానికి బస్తాలు తడిసిపోయా యని, వెంటనే మిల్లులకు తరలించా లంటూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన తహసీల్దార్ పుష్పలత, డీఆర్‌డీవో కిషన్ కాళ్లు మొక్కుతూ రైతులు ప్రాధేయపడ్డారు. దీంతో లారీ కాంట్రాక్టర్‌తో మాట్లాడిన డీఆర్‌డీవో రెండు లారీలను వెంటనే కొనుగోలు కేంద్రానికి పంపించాలని ఆదేశించారు.