Share News

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:41 AM

ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కేతేపల్లి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల డిమాండ్‌ చేశారు. రైతు సంఘం, సీపీఎం నాయకులతో కలిసి నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను గురువారం పరిశీలించారు. పంట దెబ్బతిన్న రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలన్నారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారంగా అందంచాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి. చినవెంకులు, మండల కార్యదర్శి సీహెచ్‌. లూర్దుమారయ్య, రైతు నాయకులు కోట లింగయ్య, ఎల్‌.రాజు, సీహెచ్‌.సత్తయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:41 AM