రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:37 PM
నియోజివర్గ రైతుల సంక్షేమమే ప్రధానలక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మండలంలోని చందారం గ్రామంలో ఆదివారం గ్రామీణ రైతు పొదుపు పరపతి సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనోత్పత్తి, విత్తన శుద్ది కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, జూన్ 21(ఆంధ్రజ్యోతి): నియోజివర్గ రైతుల సంక్షేమమే ప్రధానలక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మండలంలోని చందారం గ్రామంలో ఆదివారం గ్రామీణ రైతు పొదుపు పరపతి సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనోత్పత్తి, విత్తన శుద్ది కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్ ధరకంటే తక్కువకు ధరకు అందిచినప్పుడే రైతులకు న్యాయం చేసివాళ్ళమవుతామన్నారు. నాణ్యమైన ధరలకు విత్తనాలను రైతులకు అందించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, మంచిర్యాల డీసీపీ బాస్కర్‌తో కలిసి విత్తనోత్పత్తి, విత్తన శుద్ది కేంద్రంను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కళాఉత్తం, సహకార సఘం అద్యక్షుడు సారం మధూకర్, గౌరవ అద్యక్షుడు గోవర్థన్, కార్యదర్శి ముస్కు రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు మీస చంద్రయ్య, పూదరి రాజేశం, ఆర్,ప్రకాశం, ఎఎంసీ వైస్ చైర్మన్ ఆరీఫ్, గడ్డం త్రిమూర్తి, పూర్ణచందర్‌రావు, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.