Share News

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:24 PM

రైతు సంక్షేమ మే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్య మని మాజీ సర్పంచ్‌లు వి.స త్యం, చిన్నయ్యలు అన్నారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం
దేవునితిర్మలాపూర్‌లో సీఎంరేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- రైతు బంధు విడుదలపై నాయకుల హర్షం - సీఎం, మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

పెద్దకొత్తపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమ మే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్య మని మాజీ సర్పంచ్‌లు వి.స త్యం, చిన్నయ్యలు అన్నారు. ఆ దివారం మండల పరిధిలోని దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూ పల్లి కృష్ణారావు చిత్ర పటాలకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభి షేకం చేశారు. వారు మాట్లాడు తూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా 73లక్షల మంది రైతులకు ప్ర యోజనం చేకూరే విధంగా రైతు భరోసా నిధు లు విడుదల చేశారని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, గృహ నిర్మాణాలకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఫ్రీబస్సు సౌకర్యం, సన్నబియ్యం పథకం, రేషన్‌ కార్డులు వంటి పథకాలను ప్రవేశపెట్టి అగ్రగ్రా మిగా నిలుస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేవునితిర్మలాపూర్‌, గ్రామ మాజీ సర్పంచ్‌ వి.సత్యం, మాజీ ఎంపీటీసీ స భ్యులు డి.రవికుమార్‌, నాయకులు పిల్లి వెంకటే శ్‌, బాలునాయక్‌, బొల్లె విష్ణు, కేశంపేట దేవేం దర్‌, బొల్లె వెంకటేశ్‌, మిద్దెశివయ్య, కే.ఎల్లస్వా మి, బోడ వినోద్‌, బాగీ శేఖర్‌, వెంకటస్వామి గౌడ్‌, పిల్లి రాములు, పిల్లి మంత్రాలయ, కుందే లు మధు, కేశంపేట స్వామి, వంగూరి రామకృ ష్ణ, బొల్లె పెద్ద నిరంజన్‌, బాగీ బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:24 PM