kumaram bheem asifabad- రైతు వారం.. వానాకాలానికి సన్నద్ధం
ABN , Publish Date - May 03 , 2026 | 10:48 PM
అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4 నుంచి 95 తేదీ దరకు రైతు వారం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. గ్రామం, మండలం, నియోజక వర్గ స్థాయిలో జరిగే రైతువారం లో మొత్తం ఏడు శాఖలు భాగస్వాయ్యం కానున్నాయి.
వాంకిడి, మే 3 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4 నుంచి 95 తేదీ దరకు రైతు వారం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. గ్రామం, మండలం, నియోజక వర్గ స్థాయిలో జరిగే రైతువారం లో మొత్తం ఏడు శాఖలు భాగస్వాయ్యం కానున్నాయి. వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న శాఖలతో కలిసి అధికారులు రైతులను నేరుగా కలిసి వారితో మమేకం కానున్నారు. రైతు వేదికల ద్వారా గ్రామస్థాయిల్లో రైతు వారం నిర్వహిస్తే మండలం, నియోజక వర్గ స్థాయిలో రైతులను సమీకరించి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహి ంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు కార్యాచరణ సిద్దం చేశారు.
- వ్యవసాయశాఖకు..
రైతు వారంలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న ఏడు శాఖలు పాల్గొననున్నాయి. ప్రధానంగా వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, బ్యాంకులు, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, పశుసంవర్థకశాఖల అధికారులు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరిస్తారు. ఇప్పటికే వాలంటీర్లను కూడాఎంపిక చేసి వారిని విధుల్లోకి తీసుకొని శిక్షణ కూడా ఇస్తున్నారు. అధికారులతో పాటు వలంటీర్లు రైతులను కలుస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భరూసార వాలంటీర్లు రెవెన్యూ గ్రామాల వారీగా పనిచేస్తున్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి వివరించి అవసరం ఉన్న పథకానికి దరఖాస్తు చేయిస్తారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణపై కూడా అవగాహన పెంపొదిస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా యాంత్రీకరణ పథకాన్ని వ్యవసాయశాఖ రంగం సిద్దం చేసింది.
- కార్యక్రమాలు ఇలా..
ప్రభుత్వం రైతు వారం లో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించింది. 4వ తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలను వ్యవసాయశాఖ రైతు వేదికల ద్వారా నిర్వహించనుంది. నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం ప్రకృతి వ్యవసాయం, వంటి వాటిని వివరిస్తారు. భూసార పరీక్ష కోసం మట్టి సేకరణ, హెల్త్‌కార్డుల పంపిణీ, ఎరువుల అవసరాలు, యాజమాన్య పద్ధతులు, నానో యూరియాపై అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా రైతులు కోరుకునే సన్నాల రకాల గురించి అధికారులు వివరిస్తారు. ఉధ్యాన పంటల సాగు, అయిల్‌పామ్ విస్తీర్ణం, ప్రత్యామ్యాయ పంటల సాగుపై ఉఽధానశాఖ రైతులను ప్రోత్సహించనుంది. అదేవిధంగా విద్యుత్, పశుసంవర్దక, నీటిపారుదలశాఖ అధికారులు సమావేశాల్లో పాల్గొంటారు. అయిల్‌పామ్ ఉత్పత్తులు ప్రదర్శించడంతో పాటు అయిల్ సీడ్స్, మిల్లెట్ గురించి రైతులకు తెలియజేస్తారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల పనితీరరు వాటితో ఉపయోగాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు ప్రదర్శనల ద్వారా నియోజకవర్గ స్థాయిలో రైతులకు సవివరంగా తెలియజేస్తారు. అదేవిధంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో కంపచెట్లు, గుర్రపుడెక్కతొలగించడంతో పాటు సమతుల్యంగా నీటి వినియోగం, కార్యాచరణపైర ఐతులను సమాయత్తం చేస్తారు. అదే సమయంలో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపడతారు. పశుసంవర్దకశాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ, పశుజాతి అభివృద్ది, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశుసంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. బ్యాంకుల విషయానికి వస్తే దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటల రుణాలు, సహకార సంఘాల ద్వారా సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవసరాల గురించి నిపుణుల ద్వారా రైతులకు తెలియచేస్తారు. మొత్తంగా ఏడుశాఖలతో కారఆ్యచరణ రూపొందించిన ప్రభుత్వం విజయవంతం చేసేందకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- మిలింద్‌కుమార్, ఆసిపాబాద్ ఏడీఏ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో బాగంగా ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నరైతు వారం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామం, మండలం, నియోజక వర్గం స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ ఈ వారోత్సవాల్లో పాల్గొంటాయి. రైతల సంక్షేమం, అభివృద్ది పథకాలను రైతులకు చేరవేయడం కోసం ఈ రైతు వారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున రైతులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి.