Share News

రైతునేస్తం వెంకటేశ్వరరావు, రైతు జయపాల్‌రెడ్డికి ఫెలో ఫార్మర్‌ అవార్డు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:13 AM

రైతునేస్తం సంస్థ నిర్వాహకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన రైతు ఎస్‌.జయపాల్‌రెడ్డికి భారత వ్యవసాయ ...

రైతునేస్తం వెంకటేశ్వరరావు, రైతు జయపాల్‌రెడ్డికి ఫెలో ఫార్మర్‌ అవార్డు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రైతునేస్తం సంస్థ నిర్వాహకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన రైతు ఎస్‌.జయపాల్‌రెడ్డికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) 2026 సంవత్సరానికి గాను ఫెలో ఫార్మర్‌ పురస్కారాన్ని అందించింది. ఢిల్లీలో ప్రారంభమైన పూసా కృషి విజ్ఞాన మేళా 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వారిద్దరికి ఈ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. రసాయన రహిత సేద్యం కోసం రైతునేస్తం ఫౌండేషన్‌ పదేళ్లుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. మహబూబాబాద్‌ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన జయపాల్‌రెడ్డి వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలపాలలో చేసిన కృషికి గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తన కృషిని గుర్తించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం, ఏఐఆర్‌ఐ అధికారులకు జయపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 03:13 AM