కాంగ్రెస్ వచ్చాకే..రైతులకు కష్టాలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:15 PM
గత బీఆర్‌ఎస్ హయాంలో రైతులు రాజులుగా బతికారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రైతులకు లేని కష్టాలు వచ్చాయ ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ ఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
లక్షెట్టిపేటలో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
లక్షెట్టిపేట, జూలై 21(ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ హయాంలో రైతులు రాజులుగా బతికారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రైతులకు లేని కష్టాలు వచ్చాయ ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ ఆర్ అన్నారు. లక్షెట్టిపేటలో సోమవారం బీఆర్‌ఎస్ పా ర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటై 32 నెలల్లో రైతుబంధు నాలుగు సార్లు ఎగ్గొట్టిందన్నారు. సీఎంకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నా రు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే యూ రియాకు యాప్ పెట్టి అస్టకష్టాలు పెడుతుందన్నారు. రేవంత్ చేతకాని పాలన వల్ల రైతులు పండించే పం టలకు సరైన సమయానికి నీరు రాదని, యూరియా దొరకదని, ఇవన్నీ లేకున్నా అష్టకష్టాలు పడి రైతులు వాళ్లకు తోచినట్లు పంట సాగు చేసి ధాన్యం కొను గో లు కేంద్రాలకు పంపిస్తే అక్కడ కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం అబద్దా లు ఆడటం రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప ఏదీ చాతగాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కా ళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు వర్షాలు లేకున్న నీ రు అందించాలని పెద్ద పెద్ద బహుబలి మోటార్లను పె ట్టి నిర్మిస్తే దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పోతుందా అని ప్రశ్నిం చారు. మరమ్మతులు చేపిస్తే తను చేసిన అసత్య ఆరో పణలు బయటకు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని తీరును ప్రొజెక్టర్ ద్వారా రైతులకు చూపించారు. అం దుకే కేసీఆర్ ఒకటికి రెండు సార్లు చెప్పిండు మోస పోతే గోసపడుతాం.. అందుకే ముందుగానే ఆలోచిం చుకుని ఓటు వేయాలని కానీ మన విలువైన ఓటును చేతకాని కాంగ్రెస్ నాయకులకు వేసి ఇప్పుడు కష్టపడు తున్నామన్నారు. తమ నాయకులపై కార్యకర్తలపై అక్ర మ కేసులు పెడితే బిడ్డా ఊరుకునేది లేదని వచ్చేది బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం అనే ఒక్క విషయం అదికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు ఎగురుడు కాదని 29నెలలు దాటాక ఒక వేళ అధికారులు రిటైర్డ్ అయిన కూడా వదిలేది లేదని హెచ్చరించారు.
మృతి చెందిన రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
మే 5వ తేదీన ప్రకృతి విపత్తులతో మృతి చెందిన లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు గుండారపు వెంకటేష్, తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నల్కి లచ్చన్న ఒక్కో కుటుంబానికి రూ.5 లక్ష ల చెక్కును కేటీఆర్ అందజేసారు. ఈనలుగురు రైతు ల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఇప్పటి వరకు మృతుల కుటుంబాలను ఆదుకున్న నాథుడు లేదన్నారు. నలుగురు మృతి చెం దితే ఒక్కరికి మాత్రమే అప్పుడు కేసీఆర్ పెట్టిన రైతు బీమా పథకం ద్వారా మంజూరు అయిన రూ.5లక్షలు వచ్చాయని మిగిలిన ముగ్గురికి రాలేదన్నారు. ఈకార్య క్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్‌రావు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా ఇంచార్జ్ నారదాసు లక్ష్మన్‌రావు, మాజీ మంత్రులు జీ వన్‌రెడ్డి, జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మ, డీసీఎమ్మెస్ మాజీ చై ర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పని లింగన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు సుధాకర్, తిరుపతి, జమున, మాజీ జడ్పీటీసీ చుంచు చిన్నయ్య, నడిపెల్లి విజిత్‌రావు పాల్గొన్నారు.