Share News

రైతులు యాసంగి సాగు చేయొద్దు

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:37 PM

రైతులు రబీ సీజన్‌లో పంట సాగు చేయవద్దని, ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున సాగు ఆలోచన మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు విజ్ఞప్తి చేశారు.

 రైతులు యాసంగి సాగు చేయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

-బోర్‌లపై ఆధారపడినా పలితం ఉండదు

-పూర్తి స్థాయిలో పంటలకు కరెంటు ఇచ్చే పరిస్ధితి లేదు

-తాగు నీటి అవసరాలకే ప్రాజెక్టుల నీరు

-మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, అక్టోబర్‌ 17(ఆంరఽధజ్యోతి) : రైతులు రబీ సీజన్‌లో పంట సాగు చేయవద్దని, ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున సాగు ఆలోచన మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయన్నారు. అయిన ప్పటికీ ఖరీఫ్‌ సీజన్‌లో పంటలలో ఏ మాత్రం నష్టం కలగకుండా విజయవంతంగా సాగు నీరు అందిం దన్నారు. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నందున ప్రాజెక్టులపైనే కాకుండా బోర్లు, బావులపై ఆధారపడ్డ వారు కూడా రబీ సీజన్‌లో సాగు మానుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులలో ఉన్న నీరు తాగు నీటి కోసం వినియోగించే పరిస్ధితులు ఉన్నాయని, చుక్క నీరు కూడా సాగుకు ఇచ్చే అవకాశాలు లేవన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఆధారపడి నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఉన్నారని, వారితో పాటు హైదరాబాద్‌ ప్రజల తాగు నీటి అవసరాలకు 20 శాతం నీరు సరఫరా అవుతుందన్నారు. మానవీయ కోణంతో తాగు నీటిని సరఫరా చేయాల్సి ఉన్నందున దానిని రైతులు అర్థం చేసుకోవాలని, రెండో పంట వేసేందుకు ప్ర యత్నం చేయవద్దన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీరు జూన్‌ 21 వరకు తాగు నీటికి సరిపోతుందని, ఆలోగా వర్షాలు కురిస్తే ఇబ్బందే ఉండదన్నారు. అలాగే కడెం ప్రాజెక్టు నుంచి కూడా నిర్మల్‌ జిల్లాలోని నాలుగు మండలాలకు తాగు నీరు అందుతున్నందున ఆ నీటిపైన రైతులు ఆశలు పెట్టుకోవద్దని తెలి పారు. బోర్‌, బావులలో మోటార్లు వేసి సాగు చేస్తున్న వారు కూడా రబీ సిజన్‌ పంటలు వేయవద్దని సూ చించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా భూగర్బ జలాలు దాదాపు రెండు మీటర్లలో తుకు వెళ్లాయన్నారు. అలాగే తమ తండ్రి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నియోజక వర్గంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఏడేండ్లుగా ఆనవాయితీగా వస్తుందన్నా రు. తనతో పాటు తన సతీమణి సురేఖ ఆరోగ్యం బాగాలేనందున ఈ సారి కూడా గత సంవత్సరం మా దిరిగానే సంక్రాంతికి చీరలను అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అంండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం నత్తనడకన సాగుతుందని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, అది సమం జసం కాదన్నారు. ఎలాంటి పదవులు లేకపోయునా పార్టీలో చలామని అవుతున్న కొందరు తనను విమ ర్శించడం విడ్డూరంగా ఉందని, ఆయనను సీనియర్‌ నాయకుడని కొన్ని పత్రికలు, చానెళ్లు పేర్కొనడం ఏ మిటని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిని రూ. 5 వేల కోట్లతో చేపడతానని తెలిపారు. ఈ సమా వేశంలో మేయర్‌ ధర్ని మధూకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు తూముల నరేష్‌, మంచిర్యాల, లక్షెట్టిపే ట మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్‌, వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:37 PM