రైతులు పత్తి ఉత్పాదకతను పెంచాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:27 PM
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృ ష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువ విస్తీ ర్ణంలో పత్తి ఉత్పాదకతకు పెంపొందిం చే దిశగా ముందుకు అడుగులు వేయా లని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి
తాడూరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృ ష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువ విస్తీ ర్ణంలో పత్తి ఉత్పాదకతకు పెంపొందిం చే దిశగా ముందుకు అడుగులు వేయా లని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో తాడూరు మండల రైతులకు వ్యవ సాయశాఖ ఆధ్వర్యంలో పత్తి విత్త నాల ప్యాకెట్లను సరఫరా చేశారు. ఆయన మా ట్లాడుతూ పత్తి పంట సాగులో అఽధిక సాంద్రత మొక్కల సాగు మూలంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు ఉచితంగా విత్తనాలు, జీవ సంబంధిత పురుగు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమణారావు, సహాయ సంచాలకులు బి.పూర్ణ చంద్రారెడ్డి, మండల వ్యవసాయ అధికారి సం దీప్‌కుమార్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.